'అశ్వ‌ద్ధామ' నాగ‌శౌర్య ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా..?

By Newsmeter.Network  Published on  12 Dec 2019 5:37 AM GMT
అశ్వ‌ద్ధామ నాగ‌శౌర్య ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా..?

యంగ్ హీరో నాగ శౌర్య ఛ‌లో సినిమాతో ఘ‌న విజ‌యం సాధించాడు. ఆత‌ర్వాత నాగ‌శౌర్య న‌టించిన న‌ర్త‌న‌శాల సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఈసారి ఎలాగైనా స‌రే.. స‌క్స‌స్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో త‌నే క‌థ రాసుకుని అశ్వ‌ద్థామ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో నాగ శౌర్య స‌ర‌స‌న మెహ‌రిన్ న‌టిస్తుంది. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఉషా ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరు నిర్మిస్తున్నారు.

నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ఈ సినిమాతో తెలుగు తెరకు ప‌రిచ‌యం అవుతున్నారు. అటు క్లాస్ ఇటు మాస్ ఆడియెన్స్ ని అల‌రించే విధంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ప్యాన్ ఇండియా హిట్ గా నిలిచిన కేజీఎఫ్ కి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు- అరివు మాస్ట‌ర్స్ ఈ సినిమాకి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి చేస్తుండ‌టం విశేషం.

ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాని జ‌న‌వ‌రి 31న రిలీజ్ చేస్తున్న‌ట్టు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు. నాగ‌శౌర్య‌తో పాటు టీమ్ అంద‌రూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నాగ‌శౌర్య ఈ సినిమా పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి.. నాగ‌శౌర్య ఆశ‌లు ఫ‌లించేనా..? విజ‌యం ద‌క్కేనా..? లేదా..? అనేది తెలియాలంటే జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు ఆగాల్సిందే.

Also Read

Next Story