అప్పుడు బాగా టెన్ష‌న్ ప‌డ్డాను...

By Newsmeter.Network  Published on  18 Dec 2019 12:37 PM GMT
అప్పుడు బాగా టెన్ష‌న్ ప‌డ్డాను...

మేన‌మామ వెంక‌టేష్ తో క‌లిసి మేన‌ల్లుడు నాగ చైత‌న్య న‌టించిన చిత్రం వెంకీమామ‌. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీ పుట్టిన‌రోజు కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. అయితే.. ఈ మూవీ రిలీజ్ కి ముందు రిలీజ్ ఎప్పుడు అనేది స‌స్సెన్స్ గా మార‌డం తెలిసిందే. ఈ సినిమా 13 రిలీజ్ అయితే... 3 వ‌తారీఖున అంటే ప‌ది రోజుల ముందు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారు. ప్ర‌మోష‌న్స్ చేయ‌డానికి త‌క్కువ టైమ్ ఉన్న‌ప్ప‌టికీ విస్తృతంగా ప్ర‌చారం చేసి జ‌నాన్ని థియేట‌ర్స్ కి ర‌ప్పించ‌డంలో స‌క్స‌స్ అయ్యారు.

ఈ సినిమా థ్యాంక్స్ మీట్ లో నాగ చైత‌న్య త‌న మ‌న‌సులో మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టారు. ఇంత‌కీ నాగ చైత‌న్య ఏమ‌న్నారంటే... ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన రోజు మైండ్ బ్లాక్ అనిపించింది. ఏమ‌వుతుందో, ప్రేక్ష‌కులు సినిమాను ఎలా రిసీస్ చేసుకుంటారో అని టెన్ష‌న్ ప‌డ్డాను. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. అంద‌రూ సినిమాను త‌మదిగా భావించి ఎంజాయ్ చేస్తున్నారు. బావుంద‌ని అంటున్నారు. ప్రేక్ష‌కులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సురేష్ మామ‌, వెంకీ మామ.. ఈ ఇద్ద‌రు మామ‌లు క‌లిసి క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఎలా ఉంటుందో చూపించారు.

తాత గారి డ్రీమ్‌

ఇది తాత గారి డ్రీమ్‌. తాత గారి స‌క్సెస్‌. అందుకు చాలా హ్యాపీ. సాధారణంగా కొంత మంది ద‌ర్శ‌కులు నా కెరీర్‌లోకి వ‌చ్చి నాకు కొత్త దారిని చూపించారు. అలాంటి ద‌ర్శ‌కుల్లో బాబీ ఉన్నాడు. ఆయ‌న‌కు థ్యాంక్స్‌. రామ్‌ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్‌గారికి థ్యాంక్స్‌. ప్ర‌సాద్ మూరెళ్ళ‌గారికి ధ‌న్య‌వాదాలు. సినిమాలోని స్పాన్‌ను అద్భుతంగా విజువ‌లైజ్ చేశారు. ఇదొక ఫ్రెష్ ఇన్నింగ్స్‌. ఎఫ్ 2తో హ్యాపీ న్యూ ఇయ‌ర్‌, హ్యాపీ సంక్రాంతి చెప్పిన వెంకీమామ ఈ సినిమాతో హ్యాపీ క్రిస్మ‌స్, హ్య‌పీ సంక్రాంతి చెబుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. దాదాపు రెండేళ్లు క‌లిసి ట్రావెల్ చేశాం. కాబ‌ట్టి ఎంటైర్ టీమ్‌కు మ‌రోసారి థ్యాంక్స్‌. తెలుగు ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్ అంటూ వెంకీమామ స‌క్స‌స్ సంతోషాన్ని ఈ విధంగా పంచుకున్నారు నాగ చైత‌న్య‌.

Next Story
Share it