'అన్న వదిలేసిండు' లిరికల్ వీడియో సాంగ్ లాంచ్ చేసిన హీరో కార్తికేయ‌

By అంజి  Published on  24 Nov 2019 7:35 AM GMT
అన్న వదిలేసిండు లిరికల్ వీడియో సాంగ్ లాంచ్ చేసిన హీరో కార్తికేయ‌

రోహిత్, సుధా రావత్ హీరో హీరోయిన్లుగా ఎన్.ఎన్.ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ బ్యానర్‌లో జి.నరేష్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘విట్టల్ వాడి’. ఈ మూవీలో 'అన్న వదిలేసిండు' లిరికల్ వీడియో సాంగ్ లాంచ్ RX 100 ఫేం హీరో కార్తికేయ చేతుల మీదుగా జరిగింది.

ఈ సందర్బంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ... అన్న వదిలేసిండు సాంగ్ చాలా బావుంది.చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అన్నారు.

తెలుగు రాపర్ రోల్ రైడా మాట్లాడుతూ.. విట్టల్ వాడి మూవీలో అన్న వదిలేసిండు సాంగ్ లిరిక్స్ రాసి సాంగ్ పాడటమే కాకుండా యాక్ట్ చేయడం జరిగింది. మాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్పారు. తనకి ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌కి ప్రొడ్యూసర్‌కి థాంక్స్ అన్నారు.

హీరో రోహిత్ మాట్లాడుతూ… రోల్ రైడా అన్న కి స్పెషల్ థాంక్స్. రోల్ రైడా పాడిన ఈ సాంగ్ సూపర్ హిట్ అవుతుంది అని అన్నారు.

ప్రొడ్యూసర్ జి.నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. 90 ml షూటింగ్ లో బిజీ గా ఉండి కూడా మా లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయడానికి వచ్చిన హీరో కార్తికేయకు చాలా థాంక్స్. ఈ సాంగ్ అందరికి నచ్చుతుందని సాంగ్‌ని సూపర్ హిట్ చేయాలని అందరిని కోరుకుంటున్నా అని అన్నారు.

Next Story