ఎంత మంచివాడవురా 'ఏమో ఏమో'.. అంటూనే..!

By Newsmeter.Network  Published on  8 Dec 2019 3:10 PM GMT
ఎంత మంచివాడవురా  ఏమో ఏమో.. అంటూనే..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో రాబోతున్న పక్కా ఫ్యామిలీ ఎంటటైనర్ "ఎంత మంచివాడవురా". ఇటీవలే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులతో ఫుల్ బిజీగా గడిపేస్తోన్న చిత్రయూనిట్ ప్రమోషన్లలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం ఈ సినిమా మొదటి సాంగ్ ను లిరికల్ సాంగ్ రూపంలో రిలీజ్ చేశారు. 'ఏమో ఏమో ఏ గుండెల్లో' అంటూ సాగుతున్న ఈ పాట.. 'మనిషి జీవితం ఎలా సాగాలి, ఎలాంటి గొప్పతనంతో మనిషి బతకాలి అనే అర్ధవంతమైన ఆలోచనల రేకెత్తిస్తూ.. చక్కని మెసేజ్ ను ఇస్తూనే ఎమోషనల్ గానూ ఈ సాంగ్ ఆకట్టుకుంది.

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించిన ఈ సాంగ్ మొత్తానికి అంచనాలను అందుకుంది. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన బబ్లీ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సారి సంక్రాంతికి మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ', అలాగే అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' సినిమాలతో పాటు పోటీగా "ఎంత మంచివాడవురా" సినిమా కూడా జనవరి 15వ తేదీన రాబోతుంది. మరి ఈ పోటీలో ఎవ్వరు నెగ్గుతారో. అన్నట్లు '118' చిత్రంతో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ 'ఎంతమంచి వాడవురా'తో కూడా ఆ విజయాన్ని కొనసాగుస్తాడేమో.

Next Story
Share it