ప్చ్.. బోయపాటి కష్టం పగవాడికి కూడా రాకూడదు !

By Newsmeter.Network  Published on  24 Dec 2019 11:26 AM GMT
ప్చ్.. బోయపాటి కష్టం పగవాడికి కూడా రాకూడదు !

మొత్తానికి నందమూరి బాలకృష్ణ ఇష్టానికి అలాగే ఆయన ఆలోచనల మేరకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను స్క్రిప్ట్ పనులను పూర్తి చేశాడు. కానీ వీరి కాంబినేషన్ లో సినిమా ఏ డేట్ మొదలవుతుందో.. ఇంకా క్లారిటీ రాలేదు. నిజానికి ఎప్పుడో ఆరు నెలల క్రితం స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా హై బడ్జెట్ కారణంగా పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది. చివరికి 60 కోట్లు బడ్జెట్ ను బోయపాటి 40 కోట్లకు కుదించాడు. అయితే రూలర్ దెబ్బకు బడ్జెట్ ఇంకా కుదించాల్సిన పరిస్థితి వచ్చింది.

అది దృష్టిలో పెట్టుకునే బోయపాటి స్క్రిప్ట్ లో ప్రస్తుతం చాలా మార్పులు చేస్తున్నాడట. మరి స్క్రిప్ట్ లో చేస్తోన్న మార్పులు గురించి బాలయ్య ఎలా ఫీల్ అవుతారో. పైగా బాలయ్య ఇంతవరకూ స్క్రిప్ట్ పై ఎలాంటి కామెంట్లు చేయలేదట. స్క్రిప్ట్ బాగుందని...? లేక, బాగాలేదని..? ఇలా ఏ విషయమనేది బాలయ్య బోయపాటికి చెప్పలేదట. అయితే బాలయ్య స్క్రిప్ట్ లో హంగూఆర్భాటాలు మరియు ఫుల్ యాక్షన్ లేనిది స్క్రిప్ట్ అంగీకరించట్లేదు. ఆ లెక్కన బోయపాటి సినిమా స్టార్ట్ చెయ్యటానికి ఇంకా ఎదురు చూడాలేమో. ప్చ్.. బోయపాటి కష్టం పగవాడికి కూడా రాకూడదు..

దాంతో స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బోయపాటి కిందామీదా పడుతున్నాడు. పాపం బోయపాటి... ఈ కష్టమేదో 'వినయ విధేయ రామ'కే పడిఉంటే.. పదిహేను కోట్లు అడ్వాన్స్ అందుకుని స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిపోయేవాడు. కానీ ఏం చేస్తాడు. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచే. దాంతో బాలయ్య - బోయపాటి కాంబినేషన్ తెర పైకి వచ్చింది.

మరి ఈ సారి వీరి కాంబినేషన్ హిట్ అవుతుందో లేదో కూడా చూడాలి. హిట్ అయితే మాత్రం బాలయ్య - బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే. మరి కొడతారా.. బాలయ్య బాబు ఊపు చూస్తే అలా లేదాయే.

Next Story