'బాలయ్య బాబు'గోరికి ఓ సలహా !

By Newsmeter.Network  Published on  24 Dec 2019 5:50 AM GMT
బాలయ్య బాబుగోరికి  ఓ సలహా !

ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయం 'బాలయ్య బాబు' బోళా మనిషి అని. అదే ఆయన్ని తరుచూ ఇబ్బంది పెడుతుందని. ఇదిగో కళ్యాణ్ గారు డైలాగులు వింటే ఇది నిజమే అనిపిస్తోంది. రూలర్ సినిమాను నందమూరి అభిమానులు కూడా చూడట్లేదు. కానీ, సి.కల్యాణ్ గారు మాత్రం ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు బాలయ్య అభిమానులకు అలాగే యావత్తు ప్రేక్షక లోకానికి అభినందలు చెబుతున్నాడు. పైగా రూలర్ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడట. థియేటర్స్ లో ఖాళీ కూర్చులు తప్ప ఈగలు కూడా కనపడకపోతుంటే.. కల్యాణ్ గారు ఈ విధంగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఆయన్ని ఇక ఏమనుకోవాలి..?

దీనికి తోడు రూలర్ ను మించిన స్థాయిలో మరో సినిమా తీస్తాడట, రూలర్ కే బాలయ్య అభిమానులకు కన్నీళ్లు వస్తున్నాయి. ఈ సారి రక్తం పడుతుందేమో. అన్నట్లు త్వరలోనే బాలయ్య డేట్లు కూడా ఇస్తాడట.. ఇవ్వక ఏం చేస్తాడు.. ఎంతైనా బాలయ్య బాబు బోళా మనిషి కదా..! ఏటు వచ్చి అందరూ బాగానే ఉంటున్నారు, పాపం బాలయ్య ఫ్యాన్స్ కే బొప్పి కడుతొంది. మొత్తానికి ఈ విధంగానే బాలయ్య ముందుకు పోతే ఆయన సినిమాలు రిలీజ్ అవ్వడం కూడా కష్టమవుతుంది. ఒకప్పుడు (1995 -99 కాలంలో) బాలయ్య సినిమాకి పోటీగా చిరంజీవి కూడా సినిమాని రిలీజ్ చేసేవాడు కాదు. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు కూడా బాలయ్యతో పోటీకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

ఇప్పటికైనా బాలయ్య మారాలి. సి కళ్యాణ్ గారి లాంటి గొప్ప నిర్మాతలతో కాకుండా, ఏదో సినిమా మీద ఫ్యాషన్ ఏడ్చిన ఏ చిన్న నిర్మాతలతోనో (దిల్ రాజు, ఆత్రేయ ప్రొడ్యూసర్) సినిమాలు చెయ్యాలి. ముఖ్యంగా వైవిధమైన కథలను తీసుకుని సెన్స్ బుల్ డైరెక్టర్స్ డైరెక్షన్ లో కాస్త కొత్తగా ట్రై చేస్తే.. ఇప్పటికీ వంద కోట్లు కలెక్ట్ చేసే కెపాసిటీ బాలయ్యకు వుంది. మరి బాలయ్య ఆ రకంగా ఆలోచిస్తే ఆయనకే మంచింది.

Next Story
Share it