బాల‌కృష్ణ 'రూల‌ర్' ప‌రిస్థితి ఏంటి..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Dec 2019 12:37 PM GMT
బాల‌కృష్ణ రూల‌ర్ ప‌రిస్థితి ఏంటి..?

సంక్రాంతి స్టార్ గా పేరున్న బాలయ్య ఈ సారి సంక్రాంతిని వదిలేసి 'రూలర్' అంటూ క్రిస్మస్ ట్రీట్ ఇవ్వబోయి బాక్సాఫీస్ వద్ద పూర్తిగా తేలిపోయాడు. వెరీ స్టైలిష్ బిజినెస్ మెన్ గా బాలయ్య న్యూ లుక్ చాల బాగున్నా.. సినిమా బాగాలేకపోవడం, బాలయ్య రెండో గెటప్ అభిమానులను కూడా భయపెట్టడంతో సినిమా కలెక్షన్ల పరిస్థితి మరి అద్వానంగా తయారైంది. మొదటిరోజు మాస్ సెంటర్స్ లో కొంత హడావుడి కనిపించినా.. రెండో రోజుకే ఆ హడావుడి ఆవిరైపోయింది.

'వెంకీమామ'కి తొమ్మిదో రోజు వచ్చిన కలెక్షన్స్ కూడా రూలర్ కి రెండో రోజు రాలేదంటే బాక్సాపీస్ వద్ద రూలర్ పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇటు బి.సి సెంటర్స్ లో కూడా కలెక్షన్స్ మింగుడు పడని విధంగా ఉన్నాయి. బాలయ్యకి వచ్చిన ప్లాప్ ల పరంపర ప్రభావం ఈ సినిమా పై బలంగానే పడింది.దానికి తోడు రిపోర్ట్స్ కూడా మిక్స్డ్ గా ఉండటంతో బాలయ్యకి బలం ఉన్న సీడెడ్ ప్రాంతాల్లో కూడా ఈ సినిమాకి కలెక్షన్లు ఏ మాత్రం ఆశాజనకంగా లేకుండా పోయాయి. మెయిన్ గా సినిమాలో స్టోరీ, స్క్రీన్ ప్లే ఇంట్రస్ట్ గా సాగకపోవడం, చాలా వరకు సినిమా బోర్ కొట్టడంతో బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడిపోయింది.

అయితే కనీసం బాలయ్య అభిమానులకు, యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారికైనా ఈ సినిమా నచ్చుతుందనుకుంటే వారు కూడా ఈ సినిమా వైపు చూడట్లేదు. మొత్తానికి బాలయ్య క్రిస్మస్ సెలవులను వాడుకోలేక తరువాత సినిమాలు లైన్ క్లియర్ చేశాయి. యంగ్ హీరో రాజ్ తరుణ్ కిస్మస్ రోజే 'ఇద్దరి లోకం ఒకటే' చిత్రంతో డిసెంబర్ 25న దిగనున్నాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ దిల్ రాజు నిర్మించాడు. అలాగే మత్తు వదలరా కూడా 25నే రానుంది. మరి ఈ సినిమాలైన ఈ కిస్మస్ కి హిట్ చిత్రాలుగా నిలుస్తాయేమో చూడాలి.

Next Story
Share it