గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న అర్జున్

By అంజి  Published on  24 Feb 2020 4:22 AM GMT
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న అర్జున్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజా వనం సంయుక్తంగా తమిళనాడులో నిర్వహించిన కార్యక్రమంలో సినీ హీరో అర్జున్ తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. నటుడు అర్జున్ గెరుగంబాక్కమ్ (తమిళనాడు) లోని తన నివాసంలోని గార్డెన్ క్యూ2లో మూడు మొక్కలు నాటారు. మరో ముగ్గురిని నామినేట్ టేశారు. ఎమ్మెల్యే రోజా స్వయంగా అర్జున్ ఇంటికి వెళ్లి మొక్కలు నాటించారు..

భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని భావితరాలకు మంచి ఆక్సిజన్ అందించాలనే సంకల్పం గొప్పదన్నారు హీరో అర్జున్. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజావనంలో జగపతిబాబు , ప్రముఖ దర్శకుడు ఆర్కే సల్వామణి, నటి కుష్బూ పాల్గొనాలని వారికి ఛాలెంజ్ విసిరారు అర్జున్ . రోజా మొక్కలు నాటించడం గొప్ప శుభపరిణామం అని సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.Next Story
Share it