అల్లు శిరీష్ కొత్త సినిమా ఎవ‌రితో..?

By Newsmeter.Network  Published on  7 Dec 2019 7:54 AM GMT
అల్లు శిరీష్ కొత్త సినిమా ఎవ‌రితో..?

అల్లు శిరీష్ గౌర‌వం సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఆత‌ర్వాత మారుతితో కొత్త జంట సినిమా చేసాడు కానీ.. స‌క్స‌స్ రాలేదు. ప‌రశురామ్ తో చేసిన శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు సినిమా స‌క్సస్ అందించింది. ఆత‌ర్వాత చేసిన ఏబీసీడీ సినిమా ఏమాత్రం ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో శిరీష్ కెరీర్ లో బాగా వెన‌క‌బ‌డ్డాడు. దీంతో బాగా ఆలోచ‌న‌లో ప‌డిన శిరీష్ ఈసారి ఖ‌చ్చితంగా విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు.

క‌థ‌ల వేట‌లో కాస్త గ్యాప్ వ‌చ్చింది. ఇప్పుడు శిరీష్ కొత్త సినిమా గురించి వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఎవ‌రితో అంటే... చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ తో విజేత సినిమాని తెర‌కెక్కించిన రాకేష్ శ‌శి చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఓకే చెప్పాడ‌ట‌. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ట‌. త్వ‌ర‌లోనే ఫుల్ స్క్రిప్ట్ విని ఫైన‌ల్ చేస్తార‌ట‌.

ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తార‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లో అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేస్తార‌ట‌. మ‌రి.. ఈసారైనా శిరీష్ ఆశించిన విజ‌యం వ‌స్తుందో లేదో..?

Next Story