ఆకాష్ పూరి 'రొమాంటిక్' త‌ర్వాత చేసే సినిమాలు ఇవే...

By Newsmeter.Network  Published on  17 Dec 2019 8:29 AM GMT
ఆకాష్ పూరి రొమాంటిక్ త‌ర్వాత చేసే సినిమాలు ఇవే...

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి తొలి చిత్రం మెహ‌బూబా న‌టుడుగా మంచి పేరు తీసుకువ‌చ్చినా.. క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ ని మాత్రం ఇవ్వ‌లేదు. ఈసారి త‌న‌యుడు ఆకాష్ కి హిట్ ఇవ్వాల‌నే ఉద్దేశ్యంతో పూరి క‌థ - మాట‌లు అందించి... ద‌ర్శ‌క‌త్వ భాధ్య‌త‌ల‌ను మాత్రం త‌న శిష్యుడు అనిల్ పాడూరికి అందించారు. అదే రొమాంటిక్ మూవీ. తాజాగా హైద‌రాబాద్ లో జ‌రిగిన షెడ్యూల్ తో షూటింగ్ పూర్త‌య్యింది.

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. స‌మ్మ‌ర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఆకాష్ పూరి చేయ‌బోయే సినిమాల‌ను క‌న్ ఫ‌ర్మ్ చేసేసాడ‌ని తెలిసింది. అవును.. రొమాంటిక్ సినిమా త‌ర్వాత క‌త్తి మ‌ల్లిఖార్జున్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసేందుకు ఆకాష్ ఓకే చెప్పాడ‌ట‌. ఇది ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్. స్క్రిప్ట్ రెడీగా ఉంద‌ట‌. రొమాంటిక్ మూవీ రిలీజ్ త‌ర్వాత స్టార్ట్ చేయ‌నున్నారు. నూత‌న నిర్మాత ఈ సినిమాని నిర్మించ‌నున్నారు.

ఈ సినిమా త‌ర్వాత చేసే సినిమాను కూడా ఆకాష్ ఓకే చేసాడ‌ట‌. ఇంత‌కీ ఎవ‌రితో అంటారా..? జేమ్స్ బాండ్ మూవీని తెర‌కెక్కించిన సాయికిషోర్ తో అని తెలిసింది. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో జ‌రిగే క‌థ అట‌. దీని కోసం ప్ర‌త్యేకించి 6 నెల‌లు ట్రైనింగ్ కూడా తీసుకోనున్నాడ‌ట ఆకాష్. ఈ సినిమాకి కూడా క‌థ చ‌ర్చ‌లు పూర్త‌వ్వ‌డం.. స్క్రిప్ట్ రెడీ అవ్వ‌డం జ‌రిగింద‌ట‌. ఆకాష్ పూరి... చాలా స్పీడుగా సినిమాలు చేయాల‌నుకుంటున్నాడు. మ‌రి... రొమాంటిక్ తో స‌క్స‌స్ సాధిస్తే.. ఈ స్పీడు మ‌రింత పెర‌గ‌డం ఖాయం.

Next Story
Share it