తిరుపతి నగరంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగి పోవడంతో పాటు నిర్ధారణ పరీక్షల కోసం జనాలు కొట్టుకునే పరిస్థితి నెలకొంది. పాత ప్రసూతి వైద్యశాల్లో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వేకువజాము నుంచే బారులు తీరారు. కిట్లు పరిమిత సంఖ్యలో ఉండటంతో టెస్టు కోసం ఎగబడ్డారు. వారిని అదుపు చేయలేక సిబ్బంది చేతులెత్తేశారు.