భారీ వర్షం.. కేసీఆర్ బహిరంగ సభ రద్దు
By న్యూస్‌మీటర్ తెలుగు
సూర్యాపేట: హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నిక ప్రచారంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ప్రచారంలో భాగంగా గురువారం రోజున టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన విషయం అందరికి తెలిసిందే. హుజుర్‌నగర్ బహిరంగసభకు సీఎం కేసీఆర్ వస్తారని అందరూ ఆశించారు. అందుకు తగ్గట్టుగానే టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు భారీగా ఏర్పాట్లు చేశారు.
అయితే ఈ సభలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై ఏదైనా ప్రకటన చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, కాసేపట్లో సభ ప్రారంభం కానుండగా భారీ వర్షం కారణంగా సభను చేశారు. వర్ష ప్రభావానికి సభా వేదిక చిందరవందరగా మారింది. సభకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, శ్రేణులు వర్షంలో తడిసిముద్దయ్యారు. సభకు వచ్చిన కార్యకర్తలు వర్షం కారణంగా వెనుదిరిగారు. సీఎం కేసీఆర్ సభకు హాజరై.. హుజుర్‌నగర్ నియోజకవర్గానికి అభివృద్ధి నిధులను కేటాయిస్తారని, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెంచుతారని అంతా భావిస్తున్న సమయంలో వర్షం రావడంతో కార్యకర్తలు నిరాశకు గురయ్యారు.