చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2019 7:12 PM IST
చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

చెన్నై: విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. సింగపూర్‌, దుబాయ్‌, కొలంబో నుంచి వస్తున్న వారి దగ్గర నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండున్నర కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుదుక్కోటాయికి చెందిన మహ్మద్ అజారుద్దీన్ (24), ఇంతియాజ్ (21), అబ్దుల్ కలాం ఆజాద్ (25), కన్నూరు, చెన్నైకి చెందిన మహ్మద్ ఇబ్రహీం (70), సింగపూర్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ (30) కొలంబో నుంచి చెన్నై వెళ్తున్నారు. రామనాథపురానికి చెందిన మహ్మద్ మన్సూర్ (30), ఖాన్ మహ్మద్ (43) దుబాయ్ కు చెందినవాడు. విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహ్మద్ (25)ను అధికారులు పట్టుకుని ప్రశ్నించారు. అనంతరం..ప్రవేట్ గదిలోకి తీసుకెళ్లి సోదా చేశారు . దీంతో బంగారం బయటపడింది. కోట్ల విలువైన 2 కిలోల678 గ్రాముల బంగారాన్ని స్వాధీనంచేసుకున్నారు. మహ్మద్ రిబయాదీన్ , మహ్మద్ ఇబ్రహీం షూట్ కేస్‌ నుంచి రూ. 81వేలు, ల్యాప్‌టాప్‌లు, విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. అసలు వీరి బాస్ ఎవరు అనే దానిపై అధికారులు కూపీ లాగుతున్నారు.

Next Story