ఆర్టీసీ కార్మికుడికి హార్ట్ ఎటాక్..ఆస్పత్రికి తరలింపు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 18 Oct 2019 1:16 PM IST

చిట్యాల: చిట్యాలకు చెందిన గోసుకొండ మల్లయ్య నల్లగొండ ఆర్టీసీ డిపోలో ADCగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొన్నిరోజులగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని తోటి కార్మికులు చెబుతున్నారు. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు మల్లయ్యకు మార్ట్ ఎటాక్ వచ్చింది. కుటుంబ సభ్యులు మల్లయ్యను నార్కెట్ పల్లి కామినేని హస్పటల్ కు తీసుకెళ్లారు సీరియస్‌గా ఉండటంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించి మల్లయ్యకు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం మల్లయ్య ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు సమాచారం.
Next Story