వరల్డ్ హెల్త్ డే: మంచి ఆరోగ్యం కోసం 10 సూత్రాలను తెలుసుకోండి
1948, ఏప్రిల్ 7న యూఎన్‌వో ఆధ్వర్యంలో డబ్ల్యూహెచ్‌వో ఏర్పాటైంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ
By అంజి Published on 7 April 2023 8:26 AM ISTవరల్డ్ హెల్త్ డే: మంచి ఆరోగ్యం కోసం 10 సూత్రాలను తెలుసుకోండి
1948, ఏప్రిల్ 7న యూఎన్‌వో ఆధ్వర్యంలో డబ్ల్యూహెచ్‌వో ఏర్పాటైంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అందరికీ ఆరోగ్యం అనే థీమ్‌ను ఎంపిక చేసింది. అంతేకాదు ఈ ఏడాదితో డబ్ల్యూహెచ్‌వో 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఆరోగ్యం కోసం పది సూత్రాలను తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ సూత్రాలు మీ కోసం..
- ఉదయం నిద్ర లేవగానే పరకడుపున రెండు మూడు గ్లాసుల నీటిని సేవించాలి.
- ప్రతి రోజు కనీసం పదిహేను నిమిషాల పాటు యోగాసనాలు లేదా వ్యాయామం చేయాలి.
- వారానికి ఓ రోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించడం మంచిది. ఉపవాసం ఉన్న రోజులో కేవలం నీటిని లేదా పండ్లను మాత్రమే సేవించాలి.
- టీ, కాఫీ, పొగాకు, ధూమపానం, మద్యపానం, గుట్కా తదితరాలను సేవించకండి. మీరు తీసుకునే భోజనంలో పులుపు, మిర్చి - మసాలాలు, చక్కెర, వేపుడు పదార్థాలను దూరంగా ఉంచాలి.
- భోజనం చేసే సమయంలో మౌనంగా భుజించడం, భోజనంలో సలాడ్, రుతువులననుసరించి పండ్లు తప్పనిసరిగా తీసుకోవడం ముఖ్యం.
- ప్రతి రోజు క్రమం తప్పకుండా స్నానం చేయడం, ఉదయం రాత్రి దంతాలు శుభ్రం చేసుకోవడం ఎంతో అవసరం.
- ఉదయం మీరు తీసుకునే అల్పాహారం తేలికపాటిదై.. త్వరగా జీర్ణమయ్యేదిగా ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
- మిగిలిపోయిన లేదా పాచిపోయిన ఆహారాన్ని తీసుకోకూడదు. దీంతో ఆకలి తీరడం మాట అలా ఉంచితే అనారోగ్యం పాలవ్వడం ఖాయం.
- అలాగే రాత్రి ఎక్కువసేపు మేలుకుంటే.. ఆరోగ్యం పాడవ్వడమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేసే అవకాశాలు ఎక్కువ.
- మానసికంగా ఒత్తిగి పెరిగితే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లౌతుంది. దీంతో ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకిష్టమైన సంగీతం లేదా పుస్తకపఠనం చేస్తే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.