వంటింట్లో ఉండే ఉల్లి, వెల్లుల్లికి మొలకలు ఎందుకు వస్తాయి.. అలాంటివి తింటే మంచిదేనా..?

Why do onion and garlic sprouts in Wantint .. Is it better to eat such. ఉల్లి, వెల్లుల్లి మాత్రం ఎక్కడున్నా మొలకలు వస్తుంటాయి

By Medi Samrat  Published on  1 March 2021 10:37 AM GMT
Why do onion and garlic sprouts in Wantint

ఉల్లిపాయలు, వెల్లుల్లి ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండేవే. ఇవి వంటింట్లోనే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్‌-సి, విటమిన్‌-బి6, పోటాషియం ఫోలేట్‌ ఉంటాయి. వెల్లుల్లిలో వీటితో పాటు కాల్షియం, పాస్పరస్‌, మెగ్నీషియం, కాపరర్‌ వంటివి పుష్కలంగా లభిస్తాయి. అయితే వంటిల్లో స్టోర్‌ చేసిన ఉల్లి, వెల్లుల్లి మొలకలు రావడం మనం చూస్తూనే ఉంటాము. కొందరైతే ఆ మొలకల వరకు కట్‌ చేసి ఉపయోగిస్తుంటారు. మరి కొందరు వాటిని ఉపయోగించాలా..? వద్దా...? అన్న సందేహాలు వస్తుంటాయి. మొలకలు వస్తే మంచిదేనా..?కాదా? అనేది తెలుసుకుందాం.

సాధారణంగా మనం నేలల్లో నాటందే చాలా వరకు మొక్కలు మొలకెత్తవు. కానీ ఉల్లి, వెల్లుల్లి మాత్రం ఎక్కడున్నా మొలకలు వస్తుంటాయి. నేలలో నాటకపోయినా వాటిని అలానే ఉంచితే ఆ మొలకలు పొడవుగా పెరుగుతాయి. అందుకు కారణం లేకపోలేదు. కిచెన్‌లో ఉండే తేమ వాతావరణమేనని పరిశోధకులు అంటున్నారు. ఉల్లి, వెల్లుల్లి మొలకెత్తేందుకు కాస్త తేమ వాతావరణం ఉంటే సరిపోతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

ప్రత్యేకంగా నేలలో నాటకపోయినా, ఇలా మొలకెత్తడం అనేది వాటిలో సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇలా మొలకెత్తడం వల్ల వాటిలో ఎలాంటి టాక్సిన్లు విడుదల కావు. కానీ అవి కాస్త జిగురుగా పాడైపోయినట్లుగా మారిపోవచ్చు. అలాగే మొలకల్లో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు. మొలకల్లో ప్రొటీన్‌ ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటిని తీసుకోవడం కూడా మంచిదేనంటున్నారు నిపుణులు. అయితే ఈ మొలకలు నేరుగా తింటే కాస్త చేదుగా అనిపించవచ్చు. అందుకే మొలకలు వచ్చినవి కూరల్లో వేసుకొని తినడం మంచిదేంటున్నారు ఆరోగ్య నిపుణులు.

సాధారణంగా వంటింట్లో ఉండే తేమ కారణంగా మొలకలు వస్తుంటాయి. ఇలా కాకుండా చల్లని, పొడి ప్రదేశాలలో ఉంచినట్లయితే మొలకలు రాకుండా ఉంటాయి. వాటికి గాలి తగిలేలా చూసుకోవాలి. వాటి నుంచి విడుదలయ్యే ఇథలిన్ వల్ల కూడా ఉల్లిపాయలు మొలకెత్తుతాయి. వీలైతే మంచాల కింద లేదా అటక మీద వీటిని భద్రపర్చుకోవడం వల్ల మొలకలు రాకుండా ఉంటాయి.


Next Story