మధుమేహం ప్రస్తుత కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ప్రతిరోజు ఎంతో మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధిని గుర్తించాలంటే రక్త పరీక్షలు, యూరిన్ పరీక్షలను నిర్వహిస్తున్నారు.కానీ ప్రస్తుతం లండన్ యూనివర్శిటీ కాలేజీ నిపుణులు చేసిన కొన్ని అధ్యయనాలలో భాగంగా చెవిలో ఏర్పడే గువిలి ద్వారా మధుమేహాన్ని గుర్తించవచ్చని తెలిపారు.

చెవిలో ఉండే మైనం నుంచి గ్లూకోజ్ స్థాయిని తనిఖీ చేయగా ప్రారంభదశలో ఏర్పడే మధుమేహాన్ని గుర్తించవచ్చని నిపుణులు తెలియజేశారు.ఈ అధ్యయనంలో భాగంగా ఈ పరీక్షలలో దాదాపు 60 శాతం వరకు కచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. ఇప్పటివరకు మధుమేహాన్ని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించి దాని నిర్ధారణకు పరీక్షలను నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ అధ్యయనంలో భాగంగా మనం ఇంట్లోనే ఉండి మన చెవిలో ఉన్న గువిలి ద్వారా మధుమేహాన్ని చాలా సులభంగా గుర్తించవచ్చని పేర్కొన్నారు.

మన చెవిలో ఏర్పడిన గువిలి ద్వారా మనకు మధుమేహం ఉన్నది లేనిది తెలుసుకునేందుకు వీలుగా ఒక అధునాతనమైన పరికరాలను ఏర్పాటు చేశారు. ఈ పరికరం ఉపయోగించి మనం మధుమేహ పరీక్ష చేసుకోవచ్చని నిపుణులు తెలిపారు. అంతేకాకుండా ఈ పరికరాన్ని ఉపయోగించి ఒక వ్యక్తి ఒత్తిడికి లోనవుతున్నారా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఏది ఏమైనా మన చెవిలో ఏర్పడే గువిలి ద్వారా మధుమేహాన్ని ప్రారంభదశలోనే గుర్తించడానికి వీలు ఉండటంతో, ఇకపై దీని ప్రభావం ఎక్కువ కాకుండా చూసుకోవడానికి వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇలా చెవిలో గువిలి ద్వారా ప్రారంభ దశలోనే మధుమేహాన్ని కనుగొనడం ద్వారా వీలైనంత వరకు వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు అని భావిస్తున్నారు. ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించడంతో సరైనపౌష్టిక ఆహారాన్ని తీసుకొని శరీరానికి తగ్గ వ్యాయామాలు చేయటం ద్వారా ఈ వ్యాధి మరింత తీవ్రం కాకుండా కాపాడుకోవచ్చని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు తెలియజేశారు.
సామ్రాట్

Next Story