క్యాన్సర్ రోగుల కోసమే ఈ సరికొత్త పరికరం.. ఎలా పనిచేస్తుందంటే

క్యాన్సర్ రోగులు ఆసుపత్రిలో గడిపే సమయాన్ని తగ్గించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త పరికరాన్ని కనిపెట్టారు.

By అంజి  Published on  12 May 2024 8:35 AM GMT
Test at home kit, cancer patients, Cancer Research UK

క్యాన్సర్ రోగుల కోసమే ఈ సరికొత్త పరికరం.. ఎలా పనిచేస్తుందంటే

క్యాన్సర్ రోగులు ఆసుపత్రిలో గడిపే సమయాన్ని తగ్గించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త పరికరాన్ని కనిపెట్టారు. ఈ కొత్త పరికరానికి బ్రిటన్‌లో చట్టపరమైన ఆమోదం లభించింది. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండానే ఈ పరికరంతో క్యాన్సర్ రోగులు తమ ఇంట్లోనే బ్లడ్‌ టెస్టులు చేసుకోవచ్చు. ఆ టెస్ట్‌ రిజల్ట్స్‌ని ఈ మెషీన్ రోగి ఎంచుకున్న హాస్పిటిల్‌కి ఆన్‌లైన్‌లో పంపిస్తుంది. చిన్న ప్రింటర్ పరిమాణంలో ఉండే ఈ పరికరం నేరుగా ఆసుపత్రికి రక్త నమూనా విశ్లేషణను అందిస్తుంది. దీని ద్వారా రోగులు మాటిమాటికి ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరాన్ని ఈ పరికరం తగ్గిస్తుందని డాక్టర్లు అంటున్నారు.

మాంచెస్టర్‌లోని క్రిస్టీలో ఈ పరికరంతో ట్రయల్స్ జరిగాయి. ఇప్పుడు దీనిని బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్)కు చెందిన 12 కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే, ఇప్పటివరకు కొద్ది మందితో మాత్రమే ఈ పరికరం ట్రయల్స్ జరిగాయని యూకే క్యాన్సర్ రీసెర్చ్ చెబుతోంది. దీనిని మరింత విస్తృతంగా ఉపయోగించవచ్చో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరికరం పనితీరును మరింత నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఈ స్వచ్ఛంద సంస్థ అభిప్రాయపడింది. ఈ సాంకేతికతకు ఇది ప్రారంభం మాత్రమేనని, మరింత పరిశోధన అవసరమని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Next Story