ఒత్తిడికి గురవుతున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటించండి

Psychological stress.. Follow the tips .. ప్రస్తుతం సమాజంలో ఎందరో ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యోగ రీత్య, ఆర్థిక ఇబ్బం

By సుభాష్  Published on  2 Dec 2020 7:58 AM IST
ఒత్తిడికి గురవుతున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటించండి

ప్రస్తుతం సమాజంలో ఎందరో ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యోగ రీత్య, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఇలా ఎన్నో రకాలుగా ఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇలా రకరకాలుగా బాధలు వెంటాడుతూ ఆత్మహత్యకు కారణమవుతున్నాయి. అంతేకాదు మానసిక ఒత్తిళ్లు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇక కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడటం, ఇప్పుడున్న పరిస్థితులను జయించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశంలో కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఎన్నో ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో ఆర్థికంగా, మానసికంగా తీవ్ర మైన ఒత్తిళ్లకు లోనవుతున్నారు.

అయితే మానసిక ఒత్తిళ్ల నుంచి గట్టెక్కాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిళ్లకు గురైనట్లయితే ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి నుంచి జయించవచ్చని చెబుతున్నారు. వాకింగ్‌, రన్నింగ్‌, మెట్లు ఎక్కడ.. దిగడం, ఆటలు ఆడటం, మంచి మ్యూజిక్‌ వినడం లాంటివి చేయాలని చెబుతున్నారు. టెన్షన్‌కు మంచి ఆహారం.. టెన్షన్‌కు గురవుతున్న సమయంలో మంచి ఆహారం కూడా ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు.

బలమైన ఆహారం తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా మారుతుంది. శరీరం మొత్తం యాక్టివ్‌ అవుతుంది. విటమిన్స్‌, మినరల్స్‌, మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా ఆలోచించవద్దు కొన్ని విషయాలను పదే పదే ఆలోచిస్తుంటే టెన్షన్‌ పెరుగుతుంది. వరుసగా పనులు చేస్తుంటే ఒత్తిడికి గురవుతుంటారు. మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకుంటూ ఉండాలి.

అలాగే ఎక్కువగా ఇబ్బంది పెట్టే వార్తలను సైతం చూడకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా మానసికంగా బాగా కుంగిపోతాము. దీంతో ఆనారోగ్య సమస్యలు దరి చేరుతాయి. ఒంటరితనం వద్దు.. ఒప్పుడు ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉండే సమయంలో వీలైనప్పుడు అందరితో కలిసిపోయేలా ఉండాలి. స్నేహితులతో మాట్లాడుతుండాలి. ఏవైనా సమస్యలుంటే వారితో షేర్‌ చేసుకోవాలి. చీకటిలో ఉండకుండా ఫ్రీగా ఉండటం అలవాటు చేసుకోవాలి.

ఒత్తిడితో నిద్రలేమి

నిద్రలేమి.. ఒత్తిడికి అనేక కారణాల్లో నిద్రలేమి. చాలా మంది రోజూకు నాలుగైదు గంటలు మాత్రమే పడుకుంటారు. మనం ప్రతి రోజు కనీసం ఆరు గంటలైన నిద్రించాలని నిపుణులు చెబుతున్నారు. విశ్రాంతి లేకుండా పనులు చేయడం, యంత్రాల్లో పని చేయడం వల్ల ఆరోగ్యం చెడిపోతోంది. మంచి నిద్ర ఖచ్చితంగా అవసరం. అలాంటి సమయంలో సరిగ్గా నిద్రలేకపోతే అనేక అనారోగ్య సమస్యలు దరిచేరుతాయి. అలాగే సమయానికి భోజనం చేయడం, సమయానికి నిద్రించడం వల్ల ఒత్తిళ్ల నుంచి జయించవచ్చని సూచిస్తున్నారు.

Next Story