షుగర్‌ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్‌ చేసుకోవాలంటే?

షుగర్‌తో బాధపడే మహిళల్లో రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల గర్భం దాల్చడం కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

By -  అంజి
Published on : 14 Feb 2026 10:22 AM IST

Diabetes and Pregnancy Planning, Preconception Care for Diabetics, Managing Blood Sugar during Pregnancy, Diabetic Pregnancy Tips, Healthy Pregnancy with Diabetes, Type 2 Diabetes and Conception

షుగర్‌ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్‌ చేసుకోవాలంటే?

షుగర్‌తో బాధపడే మహిళల్లో రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల గర్భం దాల్చడం కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్‌ కావడం, శిశువులో అవకరాలు ఏర్పడటం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకోవడానికి ముందే షుగర్‌ అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. దీని వల్ల అండం సరిగ్గా విడుదల అవ్వడంతో పాటు తల్లీబిడ్డ ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు.

ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకునే షుగర్‌ పేషెంట్లు పోషకాహార నిపుణుల సూచనతో డైట్‌ పాటించాలి. ముఖ్యంగా క్యాలరీలు, కొవ్వులు ఎక్కువగా ఉన్న పదార్థాలకు, డ్రింకులకు దూరంగా ఉండాలి. పండ్లు, కాయగూరలతో పాటు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, పనీర్‌, పప్పులు, క్వినోవా, చేపలు ఆహారంలో చేర్చుకోవాలి. ఓట్స్‌, మొక్కజొన్న, బ్రౌన్‌ రైస్‌, చిరుధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో అద్భుతంగా పని చేస్తాయి.

ప్రెగ్నెన్సీ కోసం ఇవి కూడా..

ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేసుకునే క్రమంలో, గర్భిణిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆటంకాలు, సమస్యలు తలెత్తకుండా ఈ ఆరోగ్యకరమైన జీవనశైలి కాపాడుతుంది. ముఖ్యంగా శారీరక వ్యాయామం చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ సమయంలో మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, ప్రశాంతమైన నిద్రకూ ప్రాధాన్యమివ్వాలంటున్నారు నిపుణులు. ఇవన్నీ రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలను అదుపు చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

Next Story