Pineapple Benefits : పైనాపిల్ ప్రయోజనాలు ఎన్నో...
పైనాపిల్ తీపి, పుల్లని రుచిని మనమందరం ఇష్టపడతాము. పైనాపిల్‌కు చాలా ఆరోగ్యకరమైన పండుగా కూడా గుర్తింపు ఉంది.
By Medi Samrat Published on 17 Sep 2024 6:00 AM GMTపైనాపిల్ తీపి, పుల్లని రుచిని మనమందరం ఇష్టపడతాము. పైనాపిల్‌కు చాలా ఆరోగ్యకరమైన పండుగా కూడా గుర్తింపు ఉంది. దీనిలో విటమిన్ సితో పాటు విటమిన్ బి6, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, రైబోఫ్లావిన్, కాపర్, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.
దీనిని తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. పైనాపిల్ ముఖ్యంగా మాంసాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. మీ జీర్ణక్రియ బాగా లేకపోతే మీ ఆహారంలో పైనాపిల్ తప్పనిసరిగా చేర్చుకోండి. దీని వల్ల కలిగే ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం..
రోగనిరోధక శక్తికి..
పైనాపిల్ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
కీళ్ల నొప్పులకు..
యాంటీ ఇన్ఫ్లమేటరీ, నొప్పిని తగ్గించే లక్షణాలు పైనాపిల్‌లో ఉన్నాయి. దీని కారణంగా ఇది కీళ్ల నొప్పులు, బోలు ఎముకల వ్యాధి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
ఎముకలను పటిష్టానికి..
వేసవిలో పైనాపిల్ తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉండి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే క్యాల్షియం కండరాల నొప్పుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది, మాంగనీస్, కాల్షియం ఎముకలలో సంభవించే అనేక వ్యాధులను నయం చేస్తుంది.
క్యాన్సర్ నివారణకు..
ధూమపానం, పొగాకు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. పైనాపిల్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్‌లు యాంటీ-ఆక్సిడెంట్‌లను కలిగి ఉంటాయి, ఇవి కణాలను ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షిస్తాయి.
బరువు తగ్గడానికి..
మీరు బరువు తగ్గాలని ఆలోచిస్తున్నట్లయితే.. వేసవిలో పరిమిత పరిమాణంలో పైనాపిల్ తినండి. పైనాపిల్ తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు.. పొట్టలోని కొవ్వు కూడా వేగంగా తగ్గుతుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతో పాటు.. జీవక్రియను పెంచుతుంది, ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
గుండెకు మేలు..
ఇందులో ఉండే పీచు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఊబకాయం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
చర్మ ఆకృతి కోసం..
పైనాపిల్ రసంలో విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మీ శరీరం నుండి ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మ ఆకృతిని మెరుగుపరుస్తాయి. ఇవి సూర్యరశ్మి, కాలుష్యం వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని కూడా తగ్గిస్తాయి.