నైట్ డ్యూటీ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త

Nite shift duties .. ఉద్యోగంలో భాగంగా కొందరు నైట్‌ డ్యూటీలు కూడా చేస్తుంటారు. నైట్‌ డ్యూటీలు చేయడం వల్ల

By సుభాష్  Published on  17 Nov 2020 2:43 AM GMT
నైట్ డ్యూటీ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త

ఉద్యోగంలో భాగంగా కొందరు నైట్‌ డ్యూటీలు కూడా చేస్తుంటారు. నైట్‌ డ్యూటీలు చేయడం వల్ల మీ ఆరోగ్యానికి ముప్పేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రాణాంతకమైన గుండె జబ్బులు దరి చేరే అవకాశం ఉందని, అంతేకాకుండా టైప్-2 డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. భారత సంతతికి చెందిన పరిశోధకుడితో కూడిన బృందం ఈ విషయాన్ని గుర్తించింది. రాత్రి సమయాల్లో ఎక్కువగా ఉద్యోగాలు చేసేవారిలో నిద్రలేమి, మెటాబాలిక్‌ సిండ్రోమ్‌ పెరిగిపోవడంతో గుండె జబ్బులు, గుండెనొప్పి, డయాబెటిస్‌కు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా రాత్రివేళల్లో ఉద్యోగాలు చేసేవారిలో అధిక శాతం నిద్రలేమి సమస్య ఏర్పడుతుందని అన్నారు. వారంలో ఎవరైతే ఎక్కువ రోజులు నైట్‌ డ్యూటీలు చేయడం, తరచూ ఫిఫ్ట్ లు మారేవారిలోనూ ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.ఈ అధ్యయనాన్ని ది జనరల్‌ ఆఫ్ ది అమెరికా ఒస్టోపాతిక్‌ అసోసియేషన్‌ ప్రచురించింది.

అయితే నైట్ డ్యూటీ చేసే నర్సుల్లో కూడా 9 శాతం మందిలో ఈ మెటాబాలిక్‌ సిండ్రోమ్‌ సమస్య ఎక్కువగా ఉంటున్నట్లు అధ్యయనంలో గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. డే షిప్ట్ నర్సులతో పోలిస్తే వారిలో 1.8 శాతం మాత్రమే ఉందని, ఇతర అధ్యయనాలను పరిశీలిస్తే ఏళ్ల తరబడి రాత్రుల్లో డ్యూటీలు చేసేవారిలో మెల్లమెల్లగా అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నట్లు తమ పరిశోధనలలో తేలిందన్నారు. రోజుకు 24 గంటల్లో కనీసం 7 లేదా 8 గంటలు నిద్రపోవాలని పరిశోదకులు సూచిస్తున్నారు.


పగలు కంటే రాత్రుల్లో నిద్రపోతేనే ఎంతో మేలు

కాగా, పగటి పూట సమయంలో ఎక్కువ సేపు నిద్రపోయినా దాని ప్రభావం పెద్దగా ఉండదని, రాత్రి సమయాల్లో నిద్రపోతేనే ఎంతో మేలని చెబుతున్నారు. అలసటను నివారించేందుకు రోజుకు 20 నుంచి 120 నిమిషాలు అదనంగా నిద్రపోవాలంటున్నారు. జనరల్‌ షిఫ్ట్ చేసేవారికి సూర్యుని కాంతి పండటంతో ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారని, అదే నైట్‌ షిప్ట్ చేసేవారిలో అది అది లభించకపోవడంతో నిరుత్సాహంగా, అలసటగా కనిపిస్తారని పేర్కొన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి సరైన నిద్ర లేకపోవడం, సరిగ్గా తినకపోడం, సరైన వ్యాయమం లేకపోవడం వల్ల ఆరోగ్యానికి హానికరమని గుర్తించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

Next Story