హార్ట్ ఫెయిల్యూర్ భయం లేకుండా చేస్తున్న కార్డియాలజిస్ట్ డాక్టర్ మురళీధర్
Meet Dr. Muralidar Babi, who has developed programme to reverse heart failure. హార్ట్ ఫెయిల్యూర్.. ఇటీవలి కాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తున్న పదం. ఊహించని విధంగా పలువురు వ్యక్తులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Aug 2022 3:11 PM ISTహార్ట్ ఫెయిల్యూర్.. ఇటీవలి కాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తున్న పదం. ఊహించని విధంగా పలువురు వ్యక్తులు హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా ప్రాణాలను వదిలేస్తూ ఉన్నారు. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వ్యక్తులు.. మంచి అథ్లెటిక్ శరీరం ఉన్న వాళ్ల ప్రాణాలు కూడా హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా పోతూ ఉన్నాయి. గుండె మన శరీరంలో అవయవాలన్నింటికీ నిరంతరం రక్తం సరఫరా చేస్తూ ఉంటుంది. ఈ రక్తప్రసరణ వల్లనే అన్ని అవయవాలకూ పోషకాలు, ఆక్సిజన్ అందడం మాత్రమే కాకుండా రక్తంలో చేరిన కార్బన్ డై ఆక్సైడ్, శరీరంలోని జీవక్రియల వల్ల ఉత్పన్నమైన ఇతర వ్యర్థపదార్థాలు శరీరం నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. దేహంలో ప్రసరణ వ్యవస్థ నిర్వహణలో గుండె కీలకమైన బాధ్యతను నిర్వహిస్తూ ఉంటుంది. ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను గ్రహించడం, కార్బన్ డై ఆక్సైడ్‌ను బయటకు పంపించే ప్రక్రియను నిర్వహించడంలో ఊపిరితిత్తులతో కలిసి పనిచేస్తుంది. అయితే అధికరక్తపోటు (హైపర్‌టెన్షన్/హైబీపీ), కరోనరీ ఆర్టరీ డిసీజ్, డయాబెటిస్, స్థూలకాయం, వాల్వ్‌లార్ డిసీజ్, వైరల్ ఇన్ఫెక్షన్లు, మితిమీరిన మద్యపానం, పోషకాహార లోపం.. మొదలైన వాటి వలన గుండె పనితీరు దెబ్బతింటుంది.
ప్రజలను ఎంతో టెన్షన్ కు గురిచేస్తున్న హార్ట్ ఫెయిల్యూర్ గురించి కార్డియాలజిస్ట్ డాక్టర్ మురళీధర్ బాబి ప్రత్యేకమైన కార్డియాక్ రీహాబ్ ప్రోగ్రామ్ ను తీసుకుని వచ్చారు. ఈ రీహాబ్ ప్రోగ్రామ్ ద్వారా గుండె వైఫల్యం, పల్మనరీ హైపర్‌టెన్షన్, ఇతర వ్యాధులను ఎదుర్కోవచ్చు.. వాటిని తిప్పికొట్టవచ్చు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఈ కార్యక్రమాన్ని దేశంలోనే తొలిసారిగా అమలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక యూనిట్‌ను తీసుకుని రాగా.. నవంబర్ 2021 నుండి తమ పనిని చేస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో 60 మంది రోగులు తమ పేరును నమోదు చేసుకున్నారు. వారిలో నలుగురు అద్భుతమైన ఫలితాలు సాధించారు. పదిహేను మంది ఒక నెల చికిత్సను పూర్తి చేసారు. మిగిలిన వారు వివిధ దశలలో ఉన్నారు. ఇతరులకు సంబంధించి వారి పరిస్థితిని బట్టి వైద్యులు చర్యలను తీసుకుంటూ ఉన్నారు. కొందరికి చికిత్స యొక్క మొదటి దశలో ఉన్నారు.
గుండె తనంతట తానుగా రక్తాన్ని సరఫరా చేయడానికి అనుమతించాలి
కార్డియాక్ రీహాబ్ ప్రోగ్రామ్ ద్వారా తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న రోగి శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తారు. అలా చేయడం వలన గుండె రక్తాన్ని స్వయంగా పంప్ చేసే సామర్థ్యం మెరుగుపరుచుకుంటుంది. రోగి గుండె స్థితిని బట్టి వారికి అనుకూలమైన, నిర్మాణాత్మకమైన, గ్రేడెడ్ ఫిజికల్ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ అభివృద్ధి చేయబడింది. ప్రతి ఒక్క రోగికి సంబంధించి 3 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వారానికి మూడు సార్లు సెషన్‌లు ఉంటాయి. గుండె యొక్క పంపింగ్ సామర్థ్యాన్ని వారానికోసారి అంచనా వేస్తారు. వ్యాయామంలో వారి రికవరీని చూసి ప్రోగ్రామ్ లో మార్పులు, కార్యాచరణలు తీసుకుని వస్తారు.
ఈ ప్రోగ్రామ్ తర్వాత ప్రతి ఒక్కరూ పరిగెత్తగలరు
"ఇఎస్‌ఐ ప్రోగ్రామ్‌లో నలుగురు రోగులు ఇప్పుడు రోజూ 5 నుండి 15 కి.మీ వరకు పరుగెత్తగలుగుతూ ఉన్నారు. వారు హార్ట్ ఫెయిల్యూర్, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాస ఆడకపోవటం వంటి సమస్యలతో వచ్చారు. ఇద్దరు గుండె మార్పిడికి సిఫార్సు చేయబడ్డారు, కానీ ఇప్పుడు వారు ఫిట్‌గా, బాగానే ఉన్నారు." అని కన్సల్టెంట్ కార్డియాక్ రిహాబ్ స్పెషలిస్ట్, ESIC మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మురళీధర్ బాబీ చెప్పుకొచ్చారు.
40 మంది రోగులతో సిఎంసి వెల్లూరులో తన పరిశోధన ప్రాజెక్టులో భాగంగా పైలట్ ప్రాజెక్ట్‌ను చేపట్టారు మురళీధర్. CMC వెల్లూరులోని కార్డియాలజిస్ట్‌ల బృందం ఆయన ఆలోచనతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. వెల్లూరులో ప్రాజెక్టుకు రూ.60 లక్షల నిధులు వచ్చాయి. ఆయన హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐసి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో చేరినప్పుడు, ఆయన కోరుకున్న సెంటర్ ఏర్పాటుకు ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించింది.
ప్రోగ్రాం విషయంలో రోగులకు అవగాహన కల్పించడం, ఒప్పించడానికి కాస్త సమయం పట్టింది. రోగులు వారి గుండె పరిస్థితి బలహీనంగా ఉందని, వారు ఏ విధమైన వ్యాయామం చేయకూడదని ఒప్పించారు. వారి హృదయాన్ని రక్షించడానికి తక్కువగా కష్టపడాలని, వారి శక్తిని తక్కువగా ఉపయోగించడం ముఖ్యమని చెప్పుకొచ్చారు. "చాలా మంది పేషెంట్లు చిన్న, మధ్య వయస్కులకు చెందినవారు. ప్రోగ్రామ్‌ను వారికి అమలు చేసే సమయానికి.. వారు అప్పటికే మందులు వాడుతున్నారు. కొద్దిపాటి మెరుగుదల ఉండడంతో వారు ప్రోగ్రామ్ లో మరింత ముందుకు వెళ్లడానికి అంగీకరించారు" అని డాక్టర్ మురళీధర్ చెప్పారు. గుండె, ఊపిరితిత్తుల మార్పిడి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనే సంగతి తెలిసిందే..!
డాక్యుమెంట్ చేయబడిన ESIC కేస్ స్టడీస్
19 ఏళ్ల లోకిత్ గుండె, ఊపిరితిత్తుల కండరాలు సన్నగా అయ్యే పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నాడు. దీని కారణంగా, అతను కేవలం 33 సెకన్లు మాత్రమే వ్యాయామం చేయగలడు. అతనికి గుండె మార్పిడి చేయాలని సూచించారు. అయితే కార్డియాక్ రీహాబ్ ప్రోగ్రామ్ తర్వాత, అతను ఇప్పుడు 10 కి.మీ జాగింగ్ చేయగలుగుతున్నాడు.
49 ఏళ్ల రైతు దుర్గయ్య వైరల్ ఫీవర్ బారిన బాధపడ్డాడు. అయితే కోలుకున్న తర్వాత.. అతను తన వ్యవసాయ పనులు చేసుకోలేకపోయాడు. అతను డైలేటెడ్ కార్డియోమయోపతితో బాధపడుతున్నాడని గుర్తించారు. అతడి గుండె బెలూన్ లాగా పెద్దదిగా మారిపోయేది. దీంతో వ్యవసాయ పనులు చేయలేకపోయాడు. రీహాబ్ కార్యక్రమం తర్వాత.. అతను ఇప్పుడు వ్యవసాయ పనులు చేయగలుగుతున్నాడు. 5 కిలోల బరువు కూడా తగ్గాడు. ఇతర కేస్ స్టడీస్ వీడియోగ్రాఫ్ చేయబడ్డాయి. ఇతర వైద్యులకు ఉపయోగపడాలని.. మిగిలిన రోగులు అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో డాక్యుమెంట్ చేయబడ్డాయి.