నిమ్మ ఆకులతో ఎన్నో ఉపయోగాలు.. వేడి నీటిలో వేసి రాత్రి పడుకునే ముందు తాగితే..
Many uses with lemon leaves. సాధారణంగా నిమ్మకాయల వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. వాటి ఆకులతో కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి.
By Medi Samrat Published on 21 Feb 2021 11:21 AM IST
సాధారణంగా నిమ్మకాయల వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కేవలం నిమ్మకాయలే కాకుండా వాటి ఆకులతో కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి. వీటిలో ఐరన్, క్యాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ బీ1,విటమిన్ సి, ప్లేవనాయిడ్స్, రైబోఫ్లోవిన్, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. నిమ్మకాలయ వల్ల ఉన్న ఉపయోగాలు ఆకులతో కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయో తెలుసుకుందాం.
- నీళ్లను వేడి చేసి అందులో కొన్ని నిమ్మ ఆకుల్ని వేసి ఆ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా నెల రోజులు చేస్తే మైగ్రేన్ తలనొప్పి, అస్మా వంటివి తగ్గిపోతాయి. అయితే నీటిని మాత్రం మరిగించకూడదు. కేవలం వేడినీటితోనే నానబెట్టాలి.
- మానసికంగా డిప్రెషన్‌కు గురయ్యేవారు నిమ్మ ఆకులను నలిపి, ఆ వాసన పీల్చుకుంటే ఒత్తిడి తగ్గడమే కాకుండా ఉత్సాహంగా ఉండేందు ఉపయోగపడతాయి.
- ఇందులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి. బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కూడా వీటిని వాడుతుంటారు.
- నాలుగు తాజా నిమ్మ ఆకులను గ్లాసు వేడినీటిలో మూడు గంటలు నానబెట్టి తాగితే నిద్రలేమి సమస్య, గుండె దడ, నరాల బలహీనత వంటి సమస్యలు దూరమవుతాయి.
- నిమ్మ ఆకులను పేస్టుగా చేసి దానికి కాస్తా తేనే కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు.
- ముఖం మీద ఉన్న మచ్చలు, మొటిమలను తగ్గిస్తాయి.
- నిమ్మ ఆకులను మెత్తగా నూరి పళ్లకు పట్టిస్తే నోటి దుర్వాసన పోతుంది. అంతేకాదు పళ్లల్లో ఉండే బ్యాక్టీరియాను నాశనం అయ్యేలా చేస్తుంది. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
- స్నానం చేసే నీటిలో నిమ్మ ఆకులను వేసుకుని స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా వీటిని హ్యాండ్ వాష్‌లా ఉపయోగించుకోవచ్చు. ఆకులను నలిపి చేతులకు రాసుకుంటే బ్యాక్టరీయా నశిస్తుంది.