కర్నూలు కిమ్స్ వైద్యుల అరుదైన సర్జరీ
కర్నూలు లోని కిమ్స్ వైద్యులు అరుదైన సర్జరీని నిర్వహించారు. కిడ్నీ మార్పిడికి సంబంధించిన ఆపరేషన్ ను చేపట్టిన వైద్యులు అద్భుతమైన ఫీట్ ను సాధించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 July 2023 7:34 AM GMTకర్నూలు కిమ్స్ వైద్యుల అరుదైన సర్జరీ
కర్నూలు లోని కిమ్స్ వైద్యులు అరుదైన సర్జరీని నిర్వహించారు. కిడ్నీ మార్పిడికి సంబంధించిన ఆపరేషన్ ను చేపట్టిన వైద్యులు అద్భుతమైన ఫీట్ ను సాధించారు. శస్త్రచికిత్స చేసే సమయంలో పక్కటెముకలు, కండరాలను కత్తిరించకుండా 35 ఏళ్ల మహిళ మూత్రపిండాన్ని తొలగించగలిగారు. కర్నూలులోని కిమ్స్ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ విజయవంతమైంది. మొత్తం రాయలసీమ ప్రాంతంలో ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో కిడ్నీని బయటకు తీయడం ఇదే తొలిసారి. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తన 40 ఏళ్ల భర్తకు నంద్యాలకు చెందిన ఓ మహిళ తన కిడ్నీలలో ఒకదాన్ని దానం చేసింది.
కిడ్నీ మార్పిడి సమయంలో దాత, గ్రహీతకు శస్త్రచికిత్సలు చేస్తూ ఉంటారు. దాత శరీరంలో నుండి తీసినది గ్రహీత శరీరంలోకి సర్జరీ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి దాతలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేస్తేనే ఇద్దరికీ ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటాయి. శస్త్రచికిత్స అనంతరం దాతలకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నొప్పి వంటివి తెలుస్తూ ఉండడమే కాకుండా ఆపరేషన్ మచ్చలు కనిపిస్తాయి. కానీ, ల్యాపరో స్కోపిక్ పద్ధతి ద్వారా కిడ్నీని తీసినప్పుడు, ఫలితాలు మెరుగ్గా ఉంటాయని వైద్యులు చెబుతూ ఉంటారు.
ల్యాపరో స్కోపిక్ పద్ధతి
కిడ్నీని తీయడానికి చాలా కాలంగా ఓపెన్ సర్జరీ నిర్వహిస్తూ ఉంటారు. వైద్యులు పక్కటెముక, కండరాలను కత్తిరించి, మూత్రపిండాల ధమనులు, మూత్ర నాళాన్ని జాగ్రత్తగా వేరు చేసి, ఆపై తీస్తారు. ఈ శస్త్రచికిత్స తర్వాత రోగికి తీవ్రమైన నొప్పి ఉంటుంది. వైద్యులు కండరాలను తిరిగి కుట్టాలి, కుట్లు నయం అవ్వడానికి చాలా సమయం పడుతుంది.
“మహిళ మూత్రపిండము రోగికి సరిపోలింది, దీంతో లాపరోస్కోపిక్ పద్ధతిని ఎంచుకోమని ఆమెను ఒప్పించాము. ఈ పద్ధతిలో పక్కటెముకలు లేదా కండరాలను కట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం దిగువ పొత్తికడుపును అంటిపట్టుకొన్న కణజాలాన్ని కట్ చేయాల్సి వచ్చింది. ఇలా చేస్తున్నప్పుడు చుట్టుపక్కల రక్తనాళాలు చెదిరిపోకుండా చూసుకోవాలి. మేము కేవలం కండరాలను వేరు చేసి కిడ్నీని సేకరించాము. ఈ విధానం వలన శస్త్రచికిత్స అనంతరం నొప్పి నుండి రోగి పూర్తిగా విముక్తి పొందాడు, ”అని కిమ్స్ హాస్పిటల్ కర్నూల్‌కు చెందిన కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు.
కిడ్నీ దాత 35 ఏళ్ల మహిళ కావడంతో, వైద్యులు మచ్చల విషయాన్ని కూడా పరిశీలించాల్సి వచ్చింది. ఈ పద్ధతిలో కిడ్నీని తీయడానికి కొన్ని కట్స్ చేశారు. అది కూడా చాలా తక్కువగా..! దీని కారణంగా నొప్పి దాదాపుగా ఉండదు. డాక్టర్ల ప్రకారం.. దాత ఈ శస్త్రచికిత్స నిర్వహించిన తర్వాత రెండవ రోజే నడవగలిగారు. మూడవ రోజు డిశ్చార్జ్ అయ్యారు. ఈ బృందంలో డాక్టర్ ఉమామహేశ్వరరావు, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అనంతరావు, అనస్థీషియాలజిస్టులు డాక్టర్ శృతి, భువనేశ్వరి కూడా పాల్గొన్నారు.