కరోనా బారిన పడిన వారికి కిడ్నీ సంబంధిత వ్యాధులు.. తాజా పరిశోధనలలో వెల్లడి
Kidney Problems In Corona Virus Patients. కరోనా వైరస్ కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
By Medi Samrat Published on 19 March 2021 3:32 AM GMTకోవిడ్-19 మళ్లీ కొరలు చాస్తోంది. కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్‌పై చాలా పరిశోధనలు జరిగాయి. పరిశోధనలు జరుగుతున్న కొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పరిశోధకులు చేసిన పరిశోధనలలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై తీవ్ర ప్రభావం చూపుతుందని తేలింది. అయితే తాజాగా జరిపిన పరిశోధనలలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైరస్ కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా బారిన పడిన వారికి కిడ్నీలపై ఎఫెక్ట్ చూపుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అందుకే కిడ్నీ సంబంధిత వ్యాధులున్నవారు, వయసు పైడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు మరింత జాగ్రత్త ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
వైరస్ శరీరంలోని శ్వాసకోశపై చూపించే ప్రభావం కంటే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు గుర్తించారు. వైరస్ బారిన పడిన వారి కిడ్నీలు దెబ్బతినడం ఖాయమని, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
కాగా, కరోనా మహమ్మారి కొంత కాలంగా అదుపులోకి వచ్చినట్లే వచ్చి మళ్లీ విజృంభిస్తుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. మళ్లీ రూపం మార్చుకుని సెకండ్ వేవ్ కొనసాగుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు ప్రారంభించాయి.
అయితే కరోనా బారిన పడగానే అతి తక్కువ రోజుల్లోనే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. కిడ్నీలపై ఎఫెక్టు చూపగానే, శరీరంలో ఇతర అవయవాలు కూడా పని చేయడం అనేది నెమ్మదిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
Next Story