అదే పనిగా కూర్చుంటున్నారా?

Is sitting for long periods of time good for health. ప్రస్తుతం నడుస్తున్న యాంత్రిక జీవనంలో చాలా మంది ఆఫీసుల్లో గంటల

By అంజి  Published on  17 Jan 2023 11:47 AM GMT
అదే పనిగా కూర్చుంటున్నారా?

ప్రస్తుతం నడుస్తున్న యాంత్రిక జీవనంలో చాలా మంది ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చిలోనే కూర్చుంటున్నారు. అయితే ఎండల్లో, వానల్లో కష్టపడుతూ తిరిగే అవసరం లేకుండా ఏసీలోనే ఉన్నాం కదా! అనుకోని అలాగే గంటల తరబడి కూర్చిలోనే కూర్చుంటే అనారోగ్య ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా గంటల తరబడి కూర్చిలోనే కూర్చుంటూ పనిచేసే వారిలో అకాల మరణాలు సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు.

అదే పనిగా కూర్చోవడం వలన కలిగే వ్యాధులు

ఎక్కువ సమయం కూర్చుని ఉండే వారు, మధుమేహం, గుండె జబ్బుల వంటి అనారోగ్యసమస్యల బారిన పడుతారని పలు అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు ఇలా కదలకుండా ఎక్కువసేపు కూర్చునే ఉండడం మెదడుపై కూడా ప్రభావం చూపిస్తున్నట్టు అమెరికా పరిశోధనల్లో వెల్లడైంది. మెదడులోని జ్ఞాపకశక్తికి సంబంధించిన మీడియల్ టెంపోరల్ లోబ్ పొర దెబ్బతింటుందని తద్వారా అది అల్జీమర్స్‌కి దారితీస్తుందట. కదలకుండా కూర్చొని పనిచేసేవారికి గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డ కడుతుందని తేలింది. మరోవైపు గంటల తరబడి కూర్చోనే వారిలో వెన్నునోప్పి సమస్యలు ఎక్కువై చాలా మంది పిల్లల్ని కనే సామర్థాన్ని కోల్పోతున్నారు.

ముప్పు నుంచి ఇలా రక్షణ పొందండి

* 40 నిమిషాల కంటే ఎక్కువ సేపు కూర్చొవద్దు.

* పనిచేస్తూ మధ్య మధ్యలో కాస్త నాలుగడుగులు వేస్తుండాలి.

* లిఫ్ట్ ఉన్నా సరే…ఆఫీసు పైకి వెళ్లేందుకు వీలైనంత వరకూ మెట్లనే ఉపయోగించాలి.

* భోజన విరామ సమయంలో కనీసం పది నిమిషాలు నడవాలి.

* తరచూ లేచి నడవడం కుదరకపోతే… ఉన్న చోటే కాసేపు కాళ్లను, చేతులను స్ట్రెచ్ చేస్తూ ఉండాలి.

Next Story