మారుతున్న ఆహారపు అలవాట్లలో భాగంగా చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఎన్నోరకాల నొప్పులతో బాధపడుతున్నారు. అయితే ఈ నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి ఎన్నో రకాల మందులను వాడుతూ ఉంటారు. మందులు, మాత్రలు వేసుకోవడం వల్ల కేవలం కొంతవరకు మాత్రమే ఉపశమనం కలిగించినప్పటికీ దీర్ఘకాలికంగా ఎన్నో సమస్యలను తెచ్చి పెడుతుంది.

అలాంటప్పుడు బాధించే నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి మన వంటింట్లోనే ఎన్నో రకాల నొప్పుల‌ను నివారించే ఔషధాలు ఉన్నాయని మీరు ఎప్పుడైనా గమనించారా? వంటింట్లో దొరికే నొప్పి నివారణ ఔషధాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ఎక్కువగా కండరాల నొప్పి, పంటి నొప్పి, నరాల నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు మన ఇంటి ఆవరణంలో లభించే పుదీనా ఆకుల రసాన్ని నూనెలో కలిపి రాయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా పుదీనా ఆకులను నమలడం ద్వారా జీర్ణక్రియ రేటు కూడా మెరుగుపడుతుంది. అదే విధంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం భోజనంలో తీసుకోవడం ద్వారా కడుపులో వచ్చే మంట సమస్యకు పరిష్కారం అని చెప్పవచ్చు.

ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడేవారు, నెలసరి నొప్పులతో బాధపడే మహిళలు,మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు అల్లంతో తయారుచేసిన టీ తాగడం వల్ల వీటి నుంచి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా కీళ్ల నొప్పులు సమస్యతో బాధపడేవారు వెల్లుల్లిని కొద్దిగా నూనెలో వేడి చేసి ఆ రసాన్ని నొప్పి ఉన్న చోట మర్దన చేయడం ద్వారా తొందరగా నొప్పి తగ్గుతుంది. వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల చెవిలో ఇన్ఫెక్షన్ అయినప్పుడు, నోటి ఇన్ఫెక్షన్ల నుంచి విముక్తి కలిగిస్తుంది.

ప్రతి ఒక్కరి వంటింట్లో చాలా విరివిగా లభించే వాటిలో పసుపు ఒకటి అని చెప్పవచ్చు. పసుపు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం ఎన్నో రకాల చర్మ సమస్యల నుంచి కాపాడుతుంది. చర్మంపై అలర్జీ వంటివి ఏర్పడినప్పుడు పసుపును కలబందతో పాటు కలిపి చర్మంపై రుద్దడం ద్వారా అలర్జీ సమస్యలు తగ్గిపోతాయి. ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలకు మన వంటింట్లో ఎన్నో పరిష్కార మార్గాలు దొరుకుతాయని చెప్పవచ్చు.


సామ్రాట్

Next Story