హడలెత్తిస్తున్న వైరస్‌ ఎక్స్‌.. కోవిడ్ కంటే 20 రెట్లు ఎక్కువ

తాజాగా కరోనా తరహాలో మరో కొత్త వైరస్‌ మానవాళిని కబలించే అవకాశం ఉందని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీన్ని వైరస్‌ ఎక్స్‌ / డిసీజ్‌ ఎక్స్‌ అంటున్నారు.

By అంజి  Published on  31 Jan 2024 12:52 PM IST
virus X , WHO, Disease X Pandemic, COVID 19

హడలెత్తిస్తున్న వైరస్‌ ఎక్స్‌.. కోవిడ్ కంటే 20 రెట్లు ఎక్కువ

రెండేళ్ల కిందట ప్రపంచ దేశాలు మహమ్మారి కరోనా వంటి తీవ్రమైన వైరస్‌తో పోరాడాయి. కరోనా ప్రపంచంలో చాలా వినాశనానికి కారణమైంది. ఈ వైరస్ కారణంగా చాలా మంది మరణించారు. చాలా మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. వ్యాక్సిన్ తర్వాత కోవిడ్ ఇప్పుడు సాధారణ వ్యాధిగా మారింది. అయితే ఆరోగ్య నిపుణులు ఇప్పుడు కొత్త వ్యాధి గురించి ఆందోళన చెందుతున్నారు. దీనికి 'డిసీజ్ ఎక్స్' అని పేరు పెట్టారు. ఈ కొత్త వైరస్ స్పానిష్ ఫ్లూ వలె ప్రమాదకరం కావచ్చని భయపడుతున్నారు. మనం అజాగ్రత్త సంకేతాలను చూపిస్తే.. దీనితో కోవిడ్ కంటే 20 రెట్లు ఎక్కువ మరణాలు సంభవించవచ్చు. తాజాగా కరోనా తరహాలో మరో కొత్త వైరస్‌ మానవాళిని కబలించే అవకాశం ఉందని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీన్ని వైరస్‌ ఎక్స్‌ / డిసీజ్‌ ఎక్స్‌ అంటున్నారు. అదెలా ఉంటుంది? వాటిని ఎలా గుర్తించాలి? వాటి లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వైరస్‌ ఎక్స్‌ అంటే..

ఇది కోతులు, కుక్కలు వంటి పలు జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధి. ఇదొక ఊహాజనిత వ్యాధి. దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన అంటు వ్యాధులు సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది. ఈ వైరస్‌ ఎక్స్‌.. గతంలో కంటే వేగంగా రూపాంతరం చెందుతున్నాయని, వాటిలో కొన్ని మనుషులపై తీవ్ర ప్రభావం చూపించొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.

లక్షణాలు

జ్వరం, కండరాల తిమ్మిరి, మెడ నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, కళ్ల వాపు, వాంతులు, విరేచనాలు, వికారం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కనుక వ్యాపిస్తే కోవిడ్‌ను మించిన ప్రమాదం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలోనే పరిశుభ్రత, పోషకాహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story