వెల్లుల్లి లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యలు!
Health Secrets in Garlic. వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లు మరికొందరుంటారు.
By Medi Samrat Published on 10 Feb 2021 3:34 AM GMTవెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లు మరికొందరుంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతాం. జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్ చేయడమే కాదు అనవసరమైన ఫ్యాట్‌ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది. పరగడుపునే వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఎప్పటికప్పుడు పరిశోధనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. ఇక ఆరోగ్య రక్షణలో వెల్లుల్లి పాత్ర ఎంతో విశిష్టమైనది. వాసన ఘాటుగా ఉంటుందని, తింటే వాసన వస్తుందని కొందరు వెల్లుల్లిని అంతగా ఇష్టపడరు. కానీ... ఆరోగ్య పరిరక్షణ కోసం వెల్లుల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు.
వెల్లుల్లి అడ్రినలైన్‌ని అధిక ప్రమాణంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. క్యాలరీలను కరిగిస్తుంది. శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది.
రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది, కాలేయము ఆరోగ్యానికి ,కీళ్ళనొప్పులు తగ్గడానికి సహాయపడుతుంది. గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపు అన్ని రకాల వ్యాధులను తగ్గించడానికి వెల్లుల్లి వాడుతారు. ఆయుర్వేద ఔషధాల తయారీలలో కూడా వెల్లుల్లికి డిమాండ్ ఉంది.
అల్పాహారం తినకముందే రెండు వెల్లుల్లిపాయల్ని తింటే.. కడుపులోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. పొద్దున్నే తినడం వల్ల వెల్లుల్లికి ఈ శక్తి ఎక్కువ ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఉబ్బసం, జర్వం, నులి పురుగులు, కాలేయం, పిత్తాశయ సంబంధ వ్యాధులు మొదలైన వాటికి వెల్లుల్లి చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో ఉన్న యాంటి క్లాటింగ్ ప్రాపర్టీస్ వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టుకోవడంలాంటివి (బ్లడ్ క్లాట్స్) సంభవించవు. పచ్చి వెల్లుల్లిని తినలేకపోతే ఆహారపదార్థాలలోనైనా వేసుకొని తప్పనిసరిగా వెల్లుల్లి తినడం మంచిది.