భారత దేశంలో ఆచార సంప్రదాయాల నుండి వంటకాల వరకు అన్నిటిలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది గుమ్మడికాయ. మనం ఏ శుభకార్యానికైనా గుమ్మడికాయ కొట్టకుండా ప్రారంభించం. అంతే కాదు ఇంటి ముందు ఏ దిష్టీ తగలకుండా గుమ్మడి కడతాం. అలాంటి గుమ్మడిలో అద్భుతమైన ఔషదాలు ఉన్నాయి.. దీన వల్ల ఎంతో మంచి ఆరోగ్యం సమకూరుతుంది.అనేక వంటలలో కూడా గుమ్మడికాయను ఉపయోగిస్తారు.

గుమ్మడికాయలో ఆరోగ్య లక్షణాలతో పాటు, సౌందర్య ప్రయోజనాలు కూడా నిండుకుని ఉంటాయి. గుమ్మడిలో పీచు ఎక్కువ. కేలరీలు తక్కువ. ఇలా ఇది త్వరగా ఆకలి వేయకుండా, బరువు పెరగకుండా చూస్తుంది. పీచుతో మలబద్ధకం కూడా దూరమవుతుంది. గుండె , ఊపిరితిత్తులు,కిడ్నీల ఆరోగ్యానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.

కొన్ని రకాల క్యాన్సర్లు, స్ట్రోక్‌లు తగ్గడినికి దోహదపడుతుంది. గుమ్మడి లో ఉండే విటమిన్ సి వల్ల మన రక్తంలోని తెల్ల రక్తకనాల వృద్ధికి ఇది తోడ్పడుతుంది. గుమ్మడి ముక్కల్లోని పొటాషియం రక్తపోటు తగ్గటంలో సాయపడుతుంది. ఫలితంగా పక్షవాతం ముప్పూ తగ్గుముఖం పడుతుంది.గుమ్మడే కాదు గుమ్మడి గింజల్లోనూ ఎన్నో పోషకాలు ఉన్నాయి. చాలా మంది గుమ్మడి తిన అందులోని గింజలను పాడేస్తుంటారు.

అంతే కాదు గింజల్లోనూ ఎన్నో ఔషధ విలువలు ఉన్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలైన అర్థరైటీస్, క్యాన్సర్ వంటి జబ్బులతో పాటు హార్ట్ పేషెంట్లు గుమ్మడి గింజలు తినడం వల్ల ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.


సామ్రాట్

Next Story