పుదీనాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా..?

Health Benefits of Mint. పుదీనాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

By Medi Samrat  Published on  11 March 2021 3:15 PM GMT
Health Benefits of Mint

పుదీనా.. ఇది దాదాపు అన్ని వంటల్లో వాడుతుంటారు. అంతేకాదు పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పుదీనాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏడాది పొడవునా ఏ సీజన్‌తో సంబంధం లేకుండా లభిస్తుంది. దీని ద్వారా కొన్ని జబ్బులు కూడా నయమవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. కానీ చాలా మందిలో పుదీనాలో ఉన్న ఔషధ గుణాలు తెలియవు. అయితే పుదీనా వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం..

పుదీనాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ కొవ్వు పదార్థాలు ఎక్కువే. విటమిన్‌ ఏ, విటమిన్‌ సి, డీ,బీ కాంప్లెక్స్‌ విటమిన్లు ఆ పుదీనాలో పుష్కలంగా లభిస్తాయి. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అధిక ఐరన్‌, పోటాషియం, మాంగనీస్‌ వంటివి లభిస్తాయి. దీంతో శరీరంలో రక్తం శాతం పెరగడంతో పాటు మెదుడు పనితీరు బాగా మెరుగవుతుంది.

పుదీనాలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. దీంతో పాటు జీర్ణవ్యవస్థ ప్రక్రియ కూడా ఎంతో మెరుగవుతుంది. అలాగే పుదీనా తరుచుగా తీసుకోవడం వల్ల ఆస్తమాని అదుపులో పెట్టుకోవచ్చు.

తలనొప్పి మంచి ఔషధం

పుదీనాలో ఉండే మెంథాల్‌ తలనొప్పిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు మీ నుదుటిపై పుదీనా రసంతో మసాజ్‌ చేసినట్లయితే మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఒత్తిడి నుంచి దూరం..

పుదీనా వాసన చూడటం వల్ల ఒత్తిడి నుంచి దూరం కావచ్చని పరిశోధనలో తేలింది. అరోమా థెరపీలో కూడా పుదీనాని వాడతారు. మెదడులో కార్టిసాల్‌ స్థాయిని నియంత్రించి విశ్రాంతిని ఇవ్వడంతో పుదీనా సహకరిస్తుంది.

పుదీనాతో బరువు తగ్గవచ్చు..

పుదీనా వల్ల బరువు కూడా తగ్గవచ్చంటున్నారు. ఇందులో ఉండే ఆమ్లాలు జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. జీర్ణక్రియను మెరుగు పర్చడం వల్ల సహజసిద్ధంగా బరువు తగ్గవచ్చని పరిశోధనలో తేలింది. అందుకే ఆహారంలో పుదీనాను చేర్చుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నారు. అంతేకాదు పుదీనా జ్యూస్‌, పచ్చడి, పుదీనా టీ లాంటివి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు.


Next Story
Share it