ప్రతిరోజూ పెరుగు తీసుకోవడంతో ఎన్నో ప్రయోజనాలు!

Health benefits of eating curd daily. ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది.

By Medi Samrat
Published on : 19 Feb 2021 1:03 PM IST

Health benefits of eating curd daily
మనలో చాలామందికి పెరుగన్నం తినకపోతే భోజనం చేసినట్లే అనిపించదు. రోజుకి రెండుసార్లయినా పెరుగు తినాల్సిందే అంటున్నారు పోషకాహార నిపుణులు. ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది. బరువు తగ్గాలనో, నిద్ర వస్తుందనో ఈ మధ్య చాలామంది దీన్ని తీసుకోవడం మానేస్తున్నారు. రోజూ పెరుగు తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పలు అనారోగ్య సమస్యలు కూడా దరి చేరవు.


రోజుకి రెండుసార్లయినా పెరుగు తినడం వల్ల ఎంతో మంచిదని అంటున్నారు నిపుణులు. రోజు పెరుగు తినవడం వల్ల రక్తప్రసవరణ బాగా జరిగి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. నిత్యం పెరుగు తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పలు అధ్యయనాలలో తేలింది. పెరుగులో ఉండే ల్యాక్టో బాసిల్లస్ బ్యాక్టీరియా శరీరంలోని బి మరియు టి వంటి తెల్ల రక్తకణాలను పెరిగేలా ఛేస్తుంది. అల్సర్‌తో బాధపడేవారు పెరుగు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

శరీరంలో నీరు చేరినవారు పెరుగును ఎక్కవగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.పెరుగులో కాస్తా ఉప్పు కలుపుకుని తినడం వల్ల అజీర్తి సమస్యులు తగ్గుతాయి. జిగట విరేచనాలతో బాధపడేవారు పెరుగులో కొంచెం మెంతులు కలుపుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. పెరుగు తినడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా పొందవచ్చు. వాటిలోని విటమిన్ ఇ, జింక్, ఫాస్పరస్, ఇతర మైక్రో మినిరల్స్ చర్మాన్ని అందంగా, కాంతివంతంగా ఉండెలా చేస్తుంది. పెరుగులో ఉండే క్యాల్షియం ఫాస్పరస్ ఎముకలకు దంతాలను బలంగా ఉంచుతుంది.


Next Story