మజ్జిగతో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరు

Health Benefits of Buttermilk.వేసవిలో మజ్జిగను చల్లచల్లగా తాగితే మనకు అనేక ప్రయోజనాలున్నాయి.

By Medi Samrat  Published on  16 March 2021 4:18 AM GMT
Health Benefits of Buttermilk

వచ్చేది వేసవి కాలం. చాలా మంది ఈ సీజన్‌లో మజ్జిగను తీసుకుంటారు. అయితే మజ్జిగతే ఎన్నో లాభాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరానికి మజ్జిగ ఎంతో అవసరం. ఇతర శీతలపానియాల కంటే ఈ పానీయం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో చల్లచల్లగా తాగితే మనకు అనేక ప్రయోజనాలున్నాయి. అవేమిటో చూద్దాం.

► వేసవిలో మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఎండా వేడి నుంచి ఉపశమనం కలుతుంది. ఎండకు వెళ్లి వచ్చేవారు ఇంటికి రాగానే చల్లని మజ్జిగలో నిమ్మకాయ రసం పిండుకుని తాగినట్లయితే వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉంటారు. శరీరంలో ద్రవాలు సమతూకంలో ఉంటాయి.

► మజ్జిగను తాగడం వల్ల శరీంలో ఉన్న చెడు కొలెస్టాల్‌ తగ్గుతుంది. మజ్జిగలో ఉండే బయోయాక్టివ్‌ సమ్మేళనాలు కొలెస్టాల్‌ స్థాయిలను నియంత్రిస్తాయి. అందువల్ల చెడు కొలెస్టాల్‌ తగ్గి మంచి కొలెస్టాల్‌ పెరుగుతుంది.

► కాల్షియం లోపం ఉన్నవారికి మజ్జిగ ఎంతగానో ఉపయోగపడుతుంది. మజ్జిగ వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. అంతేకాదు ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. మజ్జిగ తాగడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు లాంటివి తగ్గిపోతాయి. ముఖ్యంగా గ్యాస్‌, అసిడిటీ సమస్య ఉన్నవారికి మజ్జిగా ఎంతో ఉపయోగపడుతుంది. జీర్ణ సమస్యలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.

► మజ్జిగ అన్నంలో మామిడి పండ్లను కలిపి తినడం వల్ల విటమిన్‌-ఏ,డీ శరీరానికి పుష్కలంగా అందుతుంది. పలచని మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు కలిపి పిల్లలు, పెద్దలు తాగినట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
Next Story