పసుపుతో చక్కటి ఆరోగ్యం..!
Good health with turmeric. భారతదేశంలో విస్తృతంగా వాడబడే ఆరోగ్యకరమైన పదార్ధాలలో పసుపు ఒకటి. కేవలం వంటల్లోనే కాదు
By Medi Samrat
భారతదేశంలో విస్తృతంగా వాడబడే ఆరోగ్యకరమైన పదార్ధాలలో పసుపు ఒకటి. కేవలం వంటల్లోనే కాదు.. శుభకార్యాల్లో కూడా వాడుతుంటారు. తెలుగు వారు ఏ శుభకార్యం అయినా కాళ్లకు పసుపు రాసుకోవడం సాంప్రదాయం. పసుపుతో కొన్ని చిట్కాలు పాటించే అందం మరియు ఆరోగ్యం మీ సొంతం చేసుకొవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పసుపులోని కర్కుమిన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించగలదు. ఇది కాలేయాన్ని కాపాడుతుంది మరియు గట్టిపడకుండా చేస్తుంది. శరీరంలో ఉండే మలినాలను, విష పదార్ధాలను పసుపు పోగోడుతుంది. ఇటీవల ప్రబలిపోతున్న కరోనా వ్యాధిని నిర్మూలించే ఔషదాల్లో పసుపు ముఖ్యపాత్ర వహిస్తుంది.
డయాబెటిస్ ఉన్నవాళ్ళు పసుపు కలిపిన పాలు తాగటం వలన రక్తంలో ఉన్న చక్కెర ను తగ్గిస్తుంది దీని వలన షుగర్ అదుపులో ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేడి పాలల్లో పసుపు కలుపుకోని ఉదయం,సాయంత్రం తాగినట్లయితే జలుబు, రోంప చాలా తోందరగా తగ్గుతాయి.గోంతు ఇన్ ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది. శరీరంలో ఉండే మలినాలను, విష పదార్ధాలను పసుపు పోగోడుతుంది.
కరోనా వైరస్ భారిన పడ్డవారు వేడి పాలల్లో కానీ నీటిలో కానీ పసుపు కలుపుకొని తాగితే మంచి ఉపశమనం ఇమ్యూనిటీ పవర్ పెరిగేలా చేస్తుంది. చర్మనికి సంబందించిన వాటిల్లో కూడా పసుపు ఒక చక్కని మెడిసిన్. ముఖంపై వచ్చే మొటిమలను నివారించటానికి చర్మన్ని కాంతివంతంగా మార్చటానికి పసుపు చాలా ఉపయోగపడుతుంది.పాలల్లో పసుపు కలుపుకోని ముఖానికి రాసుకుంటే ముఖ ఛాయ మెరుస్తుంది. ఆర్థరైటిస్, చర్మ క్యాన్సర్, గాయాలు, కాలేయ వ్యాధులు మరియు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు మూలికా చికిత్సగా ఉపయోగిస్తారు .