ఏటా 75000 భారతీయ మహిళల ప్రాణాలు తీస్తున్న గర్భాశయ క్యాన్సర్
ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవానికి ముందు, గర్భాశయ క్యాన్సర్‌పై చాలా అవగాహన కలిగింది. నటి-మోడల్ పూనమ్ పాండే తాను చనిపోయానని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Feb 2024 2:10 PM ISTఏటా 75000 భారతీయ మహిళల ప్రాణాలు తీస్తున్న గర్భాశయ క్యాన్సర్
ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవానికి ముందు, గర్భాశయ క్యాన్సర్‌పై చాలా అవగాహన కలిగింది. నటి-మోడల్ పూనమ్ పాండే తాను చనిపోయానని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆమె బృందం సోషల్ మీడియాలో పూనమ్ గర్భాశయ క్యాన్సర్‌తో మరణించినట్లు ప్రకటించింది. గర్భాశయ క్యాన్సర్ గురించి పెద్దగా వినని చాలా మంది.. వ్యాధి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించారు. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) వల్ల కలిగే వ్యాధి గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తిని ప్రదర్శించారు.
వ్యాక్సిన్ తో ప్రమాదం నుండి బయటపడొచ్చు:
వైద్యుల ప్రకారం.. రొమ్ము క్యాన్సర్ తర్వాత మహిళలు ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ కు బలవుతూ ఉన్నారు. భారతదేశంలో ఏటా దాదాపు 75,000 మంది మహిళలను ఈ క్యాన్సర్ చెబుతూ ఉంది. ప్రతి సంవత్సరం 1.2 లక్షల మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. ఈ రోగులలో దాదాపు 65 శాతం మంది మరణిస్తున్నారు. మహిళలకు టీకాలు వేయించుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చు.
ఇటీవల, మధ్యంతర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి, 9 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు HPV వ్యాక్సినేషన్ వాడకాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం, మేడ్-ఇన్-ఇండియా HPV వ్యాక్సిన్ సెర్వవాక్ ప్రైవేట్ మెడికల్ సెటప్‌లలో రెండు డోసులు రూ.4,000కి అందుబాటులో ఉంది.
గర్భాశయ క్యాన్సర్‌పై పోరాడడానికి WHO వ్యూహం
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 2030కి సంబంధించిన లక్ష్యాలను ఇటీవల బయట పెట్టింది. గర్భాశయ క్యాన్సర్‌ను నిర్మూలించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. 15 ఏళ్లలోపు 90 శాతం మంది బాలికలకు పూర్తిగా టీకాలు వేయడం, 70 శాతం మంది మహిళలను 35, 45 ఏళ్ల సంవత్సరాలలోపు వారికి HPV పరీక్షలతో క్యాన్సర్ ను దాదాపుగా నయం చేయొచ్చని భావిస్తోంది. 90 శాతం మందిలో ముందస్తుగా క్యాన్సర్ ను గుర్తించవచ్చు. చికిత్స ఇవ్వడం ద్వారా మహిళల ప్రాణాలను కాపాడవచ్చని అంటున్నారు.
ఫెడరేషన్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా (FOGSI) మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ శాంత కుమారి మాట్లాడుతూ, “స్క్రీనింగ్ కోసం కాల్‌పోస్కోపీ, PAP స్మెర్ పరీక్షలు ప్రీ-ఇన్వాసివ్ దశలలో జరుగుతాయి. అయినప్పటికీ, స్క్రీనింగ్ మాత్రమే సరిపోదు. HPV వల్ల వచ్చే క్యాన్సర్‌ల ప్రభావాన్ని తగ్గించడానికి టీకాతో రోగనిరోధకత అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. HPV వ్యాక్సిన్‌ను తొమ్మిది లేదా పది సంవత్సరాల వయస్సు నుండి 45 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు" అని తెలిపారు.
గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు:
- అధిక, అతి తక్కువగా ఋతు రక్తస్రావం
- మెనోపాజ్ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆకస్మిక యోని రక్తస్రావం
- సంభోగం తర్వాత రక్తస్రావం ప్లస్ నొప్పి
- వెజైనల్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉండడం
- లోయర్ బ్యాక్ లేదా కటి ప్రాంతంలో నొప్పి
- అసాధారణ బరువు కోల్పోతూ ఉండడం
టీకా ప్రభావం చూపుతుందని తేల్చిన స్కాటిష్ అధ్యయనం:
జనవరి-చివరిలో నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (JNCI) జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం 12 నుండి 13 సంవత్సరాల వయస్సులో ఉన్న అమ్మాయిలకు గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షించడంలో రెండు డోస్ లతో కూడిన వ్యాక్సిన్ అయిన సెర్వరిక్స్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుందని పేర్కొంది. పబ్లిక్ హెల్త్ స్కాట్లాండ్‌లో గర్భాశయ స్క్రీనింగ్ కోసం స్కాటిష్ క్లినికల్ లీడ్.. తిమోతీ జె పామర్ ఈ అధ్యయనానికి నాయకత్వం వహించారు. ఈ అధ్యయనానికి పబ్లిక్ హెల్త్ స్కాట్లాండ్ నిధులు సమకూర్చింది.
ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్. సెర్వరిక్స్ అందించే కార్యక్రమాలు యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2007లో ప్రారంభమయ్యాయి. 12 సంవత్సరాల వయస్సు పైబడిన బాలికలకు వ్యాక్సిన్లు అందించడం సాధారణ సంరక్షణలో భాగంగా మారింది.