దేశంలోనే ప్రముఖ రేడియాలజిస్టుగా మారిన డాక్టర్ సికందర్ షేక్

Dr Sikander Shaikh answered destiny's call to become one of India's most renowned radiologists.డాక్టర్ సికందర్ మహమ్మద్ షేక్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sep 2022 7:15 AM GMT
దేశంలోనే ప్రముఖ రేడియాలజిస్టుగా మారిన డాక్టర్ సికందర్ షేక్

కాలేజీలో టాపర్, ఆయన పీడియాట్రిక్స్‌ను అభ్యసించాలనుకున్నాడు.. కానీ విధి మాత్రం ఆయన రేడియాలజీ చదివేలా చేసింది. ఆయన ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ రేడియాలజిస్టులలో ఒకరిగా మారిపోయారు. ఈరోజు మనం డాక్టర్ సికందర్ మహమ్మద్ షేక్ గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ సికందర్ మహమ్మద్ షేక్, హైదరాబాద్ లోని రేడియాలజీలో కన్సల్టెంట్ PET-CT, యూరోపియన్ సొసైటీ ఆఫ్ రేడియాలజీలో సభ్యత్వం కలిగిన ఏకైన హైదరాబాద్ వైద్యులు ఈయనే..!

మెడికల్ ఇమేజింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాక చాలా మార్పులకు కారణమైంది. ఇమేజింగ్ శాస్త్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఊపందుకుంది, ఎన్నో ఆవిష్కరణలకు కారణమైంది. శరీరంలోని ప్రతి అవయవానికి చికిత్స చేయడంలో ఇప్పుడు ఇమేజింగ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. మాలిక్యులర్ బయాలజీలో కూడా ఇమేజింగ్ ఎంతో గొప్ప అవసరంగా మారింది. క్యాన్సర్‌లకు చికిత్సా పద్ధతులను రూపొందించడానికి ఇమేజింగ్ ఒక ముఖ్యమైన అంశంగా ఉద్భవించింది.

క్యాన్సర్‌ల నిర్ధారణ, వాటి చికిత్సలో రేడియాలజీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. క్యాన్సర్‌ల చికిత్సలో రేడియోథెరపీ ద్వారా ప్రతిస్పందనను స్టేజింగ్ చేయడం, రీ స్టేజింగ్, మానిటరింగ్ చేయడంలో సహాయపడుతుంది.

ఏదైనా రాసి పెట్టుండాలి:

మహారాష్ట్రలోని డా. బి.ఆర్. అంబేద్కర్ మర్థ్వాడా విశ్వవిద్యాలయంలో టాపర్ అయిన డాక్టర్. షేక్ పీడియాట్రిక్స్ అభ్యసించాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టాపర్లు కూడా రేడియాలజీని చేపడుతున్నందున ఆయన దానిని ఎంచుకున్నాడు. సీటు పొందడానికి, మెడికల్ రేడియో డయాగ్నసిస్‌లో డిప్లొమా పూర్తి చేయాల్సి వచ్చింది.

"చెన్నైలోని అపోలో మెడికల్ కాలేజీలో నా రేడియాలజీ కోర్సు పూర్తి చేయడానికి అదనపు సీటు సృష్టించారు. ఐదేళ్లు అక్కడే ఉండి రేడియాలజీ గురించి నేర్చుకున్నాను. హైదరాబాద్‌.. భారతదేశంలో అభివృద్ధి చెందిన మొదటి నగరం. ఇమేజింగ్ మెషీన్లు ఇక్కడ ఉండడం.. నేను నా క్లినికల్ ప్రాక్టీస్ నుండి అకడమిక్స్, రీసెర్చ్ పేపర్‌లపై దృష్టి పెట్టగలిగాను" అని డాక్టర్ షేక్ గుర్తు చేసుకున్నారు.

రీసెర్చ్ స్టడీస్, బుక్స్:

2003 నుండి 2022 వరకు, ఇమేజింగ్ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. ఛాతీ, తల, మెడ ప్రాంతంలో కణితులను సులభంగా గుర్తించే పద్ధతుల్లో ఇది ఒకటి. గాయం ఎక్కడ ఉందో మార్కింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. డాక్టర్ సికందర్ షేక్ మాట్లాడుతూ "నేను అధ్యయనం, రీసెర్చ్ లో ప్రవేశించినప్పుడు, నేర్చుకోడానికి, తెలుసుకోడానికి చాలా ఎక్కువ అవకాశం ఉండేది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేడియాలజీ ఫోరమ్‌లలో పేపర్లను ప్రెజెంట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చింది. ఎంతో విలువైన సమాచారాన్ని పంచుకున్నాం.. చాలా నేర్చుకున్నాము. ఇది ఇది నా వృత్తిలో హైలైట్‌గా నిలిచింది" అని ఆయన చెప్పారు.


డాక్టర్ సికందర్ షేక్ యూరోపియన్ సొసైటీ ఆఫ్ రేడియాలజీలో సభ్యుడు. రాబోయే తరం రేడియాలజిస్ట్‌లకు మార్గదర్శకత్వం వహించడంలో ఆయన చేసిన కృషికి ఎన్నో ప్రశంసలు, అవార్డులు పొందారు. ఆయన బోధనా కార్యక్రమాన్ని 2021లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది.రేడియాలజీపై రెండు పుస్తకాలు రాశారు. మూడవది త్వరలో ప్రచురించబడుతుంది.

హైదరాబాద్‌లోని IIT-H, NIPRలో ప్రొఫెసర్

క్లినికల్ ప్రాక్టీస్‌తో పాటు, డాక్టర్ సికందర్ షేక్ IIT-H, NIPRలో అనుబంధ ప్రొఫెసర్‌గా కూడా ఉన్నారు. ఆయన బయో-మెడికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, మెషీన్‌లను బోధిస్తాడు. రోగనిర్ధారణ, చికిత్సలో యంత్రాలు ప్రధాన భాగంగా మారడంతో, బయో-మెడికల్ ఇంజనీర్లకు అవి ఎలా పని చేస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆయన నేర్చుకున్న ఎన్నో అంశాలు ఇప్పుడు సమాజానికి తిరిగి ఇస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుండి ఎన్నో గౌరవాలు, అవార్డులను డాక్టర్ సికందర్ షేక్ అందుకున్నారు. రోగులకు మంచి వైద్యం అందించే లక్ష్యంగా తాను ముందుకు వెళుతున్నానని తెలిపారు.

Next Story