ఎంతో మంది జీవితాల్లో మార్పులు తీసుకుని వస్తున్న థెరపీలు: డాక్టర్ రాం పాపారావు

Dr. Rampapa Rao's UCCHVAS fills gap in healthcare sector, provides post-discharge care.హార్ట్ స్ట్రోక్, గుండె నొప్పి,

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Sep 2022 9:07 AM GMT
ఎంతో మంది జీవితాల్లో మార్పులు తీసుకుని వస్తున్న థెరపీలు: డాక్టర్ రాం పాపారావు

హార్ట్ స్ట్రోక్, గుండె నొప్పి, తీవ్ర గాయాలైన ఘటనలు, ప్రమాదాలు.. వంటివి చోటు చేసుకున్నప్పుడు ట్రీట్మెంట్ అయితే ఆసుపత్రులలో లభిస్తున్నాయి కానీ.. ఆ తర్వాత వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి సమస్యలకు సంరక్షణ, తిరిగి మనిషి పుంజుకునేలా చేయడానికి కొన్ని చర్యలు తీసుకోవడం, రీహాబిటేషన్ చాలా అవసరం. అధిక ఖర్చుల కారణంగా ఆసుపత్రుల్లో ఈ సేవలు పొందలేము. చాలా మంది ఇంటికి వెళ్లిపోయి.. అక్కడే పరిష్కారాల కోసం తమవంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు.

హోమ్ కేర్ విషయంలో పలువురు థెరపిస్ట్ ల సాయం చాలా ముఖ్యం. థెరపీలను తీసుకున్న తర్వాత ఎంతో మంది జీవితాల్లో మార్పులు వచ్చాయి. రోగులు ఈ చికిత్సలను పొందేలా, నాణ్యమైన జీవనానికి తిరిగి పొందడానికి పునరావాస కేంద్రాలు( rehabilitation centers) చాలా ముఖ్యమైనవి. హెల్త్‌కేర్ సెక్టార్‌లో ఈ అంతరాన్ని సీనియర్ అనస్థీషియాలజిస్ట్ (anesthetist), UCCHVAS వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అయిన డాక్టర్ రాం పాపారావు గమనించారు.

ఆరోగ్య సంరక్షణలో పునరావాస సేవల(rehabilitation services) ప్రాముఖ్యత..?

స్ట్రోక్స్, గుండె జబ్బులు, దీర్ఘకాలిక మరియు అనియంత్రిత మధుమేహం, గాయాలు, కండరాల కణజాల లోపాలు, ఉబ్బసం, ఆర్థరైటిస్, ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లు తాత్కాలిక వైకల్యానికి దారితీస్తున్నాయి. ఈ కారణంగా సాధారణ పనులు కూడా మనం చేసుకోలేకపోతుంటారు. మునుపటి లాగా జీవించలేకపోతుంటారు.

డాక్టర్ రాం పాపారావు మాట్లాడుతూ.. 'డిశ్చార్జ్ అయ్యాక కూడా ఎంతో మంది రోగులు.. ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కొందరి గురించి చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. డిశ్చార్జ్ తర్వాత సాధారణ జీవితాన్ని గడపడానికి, కొన్ని రకాల చికిత్సలు అవసరమయ్యే వారి సంఖ్య దాదాపు 20 నుండి 25 శాతం వరకు ఉంటుందని అంచనా. నా 26 సంవత్సరాల సర్వీస్ లో ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉద్భవిస్తున్న గ్యాప్ అని నేను గ్రహించాను. దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని భావించాను. ఈ కారణంగా, 2018లో మేము UCCHVASని ప్రారంభించాము, తక్కువ ఖర్చుతో మల్టీ-థెరపిస్ట్ పునరావాస కేంద్రం. యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా, చైనా, జపాన్ దేశాల నుండి పొందిన అనుభవాల ఆధారంగా UCCHVAS రూపొందించబడింది.గత నాలుగు సంవత్సరాలలో, మేము ఎంతో మందిని మునుపటిలా ఉండగలిగేలా చేశాం.. ఎన్నో ప్రశంసలను పొందగలిగాము. మేము 2020లో హైదరాబాద్‌లో మరో కేంద్రాన్ని ప్రారంభించాము.' అని తెలిపారు.

కోలుకోవడానికి ఓ గొప్ప ప్రదేశం:

ఈ కేంద్రం రోగుల సంరక్షణకు సంబంధించి ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ - స్పీచ్ థెరపిస్ట్‌లు, కాగ్నిటివ్ థెరపీ, న్యూట్రిషనిస్ట్‌లు, క్లినికల్ సైకాలజిస్ట్‌లు, నర్సింగ్, క్లినికల్ కేర్‌లను అందించడానికి రూపొందించబడింది. ఆసుపత్రులలో ఎక్కువ కాలం ఉండడం ఖర్చుతో కూడుకున్నది.. ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్లకు కూడా దారి తీస్తుంది.. అందుకోసమే మా ఈ మల్టీ-థెరపీ సెంటర్ రూపొందించబడింది.


తీవ్రమైన రోగాలలో ఆసుపత్రి డిశ్చార్జ్‌లు ఐదు నుండి ఏడు రోజులలో ఉంటాయి. ఎవరికైతే సంరక్షణ, ఇతర సేవల అవకాశం ఉంటుందో.. వారి కోసం ఈ కేంద్రాలు పని చేస్తాయి. రోగులు తాత్కాలిక వైకల్యాన్ని అధిగమించి సాధారణ జీవితాన్ని గడపడానికి ఇక్కడ తోడ్పాటును అందిస్తారు. అందుకు సంబంధించిన పరికరాలు, నైపుణ్యం కలిగిన సిబ్బంది ఇక్కడ ఉన్నారు.

హెల్త్ కేర్ రంగంలో అభివృద్ధి చెందుతున్న విభాగం:

హైదరాబాద్ నగరంలో దాదాపు 1,000 పడకలు ఉన్నాయి, ఇవి వ్యవస్థీకృత, అసంఘటిత రంగంలో ఈ సేవలను అందిస్తాయి. ఈ సేవలు ఇప్పుడు ప్రధాన మెట్రో నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి, అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సేవల అవసరం ఉంది. డాక్టర్ రావు మాట్లాడుతూ, "ఈ సేవలపై మరింత అవగాహనతో, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాల్సి ఉంది. పలు ప్రమాదాల కారణంగా గ్రామీణ ప్రాంతంలో వైకల్యం ఎక్కువగా ఉంది. వారికి కూడా ఇలాంటి సౌకర్యాలను అందించాల్సి ఉంది." అని అన్నారు.

ధరలు ఏ విధంగా ఉన్నాయి..?

పునరావాస ఖర్చులను తిరిగి చెల్లించడానికి బీమా కంపెనీల సేవలు భారతదేశంలో ఇంకా ప్రారంభం కాలేదు. పూర్తి ప్రయోజనాలను పొందేందుకు ఖర్చును భరించేందుకు ప్రైవేట్, ప్రభుత్వ రంగాలలో వివిధ స్థాయిలలో మార్పులు అవసరం. పునరావాస కేంద్రంలో లేదా హోమ్ కేర్ కారణంగా అయ్యే ఖర్చు ప్రభుత్వం నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. పునరావాసం, గృహ సంరక్షణ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. కోవిడ్ అనంతర పరిస్థితులలో రోగులు చాలా సందర్భాల్లో పునరావాసం, గృహ సంరక్షణ సేవలు రెండింటినీ ఎంచుకుంటున్నారు. ఉత్తమమైన సేవలను అందించగల సరైన నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం ఉందని స్పష్టమైంది.

డాక్టర్ రావు మాట్లాడుతూ,భారతదేశంలో ఈ సెక్టార్ ప్రారంభ దశలో మాత్రమే ఉందన్నారు. మేము రాకముందు హైదరాబాద్‌లో రెండు సంస్థలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 10 వ్యవస్థీకృత సంస్థలు ఉన్నాయి, ఇంకా వీటి అవసరం చాలా ఉందని డాక్టర్ రాం పాపారావు చెప్పుకొచ్చారు.

Next Story