ఎంతో మందికి నాణ్యమైన జీవితాన్ని అందించడమే డాక్టర్ నయీమ్ సాదిక్ లక్ష్యం

Dr. Naeem Sadiq brings hope to those suffering from degenerative diseases. డీజెనెరేటివ్ డిసీజ్ లేదా రుగ్మతలను నయం చేయడం చాలా కష్టమైన పని. బెంగుళూరు, హైదరాబాద్‌లోని PLEXUSలో మేనేజింగ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sep 2022 1:49 PM GMT
ఎంతో మందికి నాణ్యమైన జీవితాన్ని అందించడమే డాక్టర్ నయీమ్ సాదిక్ లక్ష్యం

డీజెనెరేటివ్ డిసీజ్ లేదా రుగ్మతలను నయం చేయడం చాలా కష్టమైన పని. బెంగుళూరు, హైదరాబాద్‌లోని PLEXUSలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నయీమ్ సాదిక్‌ ఈ బాధ్యతలను తన భుజం మీద వేసుకున్నారు. రుగ్మతలను ఎదుర్కొంటున్న వ్యక్తుల పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా.. నాణ్యమైన జీవితాన్ని అందించడం ఒక సవాలుగా మారింది. తన జీవితంలో చోటు చేసుకున్న ఎన్నో విషయాలను డాక్టర్ నయీమ్ సాదిక్‌ న్యూస్‌ మీటర్‌తో పంచుకున్నారు. "నేను స్కూల్‌లో ఉన్నప్పుడు మా నాన్న స్ట్రోక్‌తో బాధపడ్డారు. మేము అన్ని ప్రయత్నాలు చేసాము, కానీ అతను మంచానపడ్డారు. ఎంతో గొప్పగా బతికిన నా తండ్రి.. అలా మంచాన పడడం చూసి చాలా బాధపడ్డాను. అప్పుడే నేను డాక్టర్‌ అవ్వాలని అనుకున్నాను. నరాలవ్యాధికి చికిత్స చేయాలని నిశ్చయించుకున్నాను" అని డాక్టర్ సాదిక్ చెప్పారు.

డా. సాదిక్ బళ్లారి ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS చేశారు. బెంగుళూరులోని NIMHANS నుండి మనో రోగ చికిత్స(psychiatry)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేశారు. లండన్‌లో న్యూరాలజీ, క్లినికల్ న్యూరోఫిజియాలజీని అభ్యసించారు. ఇంగ్లాండ్‌లోని వైద్య సంస్థలలో పనిచేశారు. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్‌లో పనిచేశారు. ఈ సమయంలో చైనా, రష్యాలో మంచి ఫలితాలను ఇస్తున్న స్టెమ్ సెల్ చికిత్సల గురించి తెలుసుకున్నారు. "నేను స్టెమ్ సెల్ చికిత్సా విధానాలను నేర్చుకున్నాను. నేను భారతదేశానికి తిరిగి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్నాను" అని ఆయన చెప్పారు.


టిష్యూ కల్చర్, స్టెమ్ సెల్ థెరపీ, న్యూరాలజీలో శిక్షణ పొందిన డాక్టర్ సాదిక్.. నరాల సంబంధిత రుగ్మతలు, వ్యాధుల చికిత్సకు ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, 15 ఆగస్టు 2011న ప్లెక్సస్‌ను ప్రారంభించారు. "అందుబాటులో మందులు లేకపోవడం వల్ల తరచుగా నిర్లక్ష్యం చేయబడిన వారికి చికిత్సను అందించాలని భావించి భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్లెక్సస్‌ ను ప్రారంభించాలని అనుకున్నాను" అని ఆయన తెలిపారు.

స్టెమ్ సెల్ థెరపీ గురించి డాక్టర్ సాదిక్ వివరిస్తూ.. "స్టెమ్ సెల్ థెరపీ అనేది తుంటి ఎముక నుండి కణాలను సంగ్రహించి, శరీరంలోకి తిరిగి ఇంజెక్ట్ చేసే చికిత్సకు సంబంధించిన పునరుత్పత్తి రూపం. ఇది సురక్షితమైన, నొప్పిలేని చికిత్స. ఎన్నో ఔషధాలను ప్రయత్నించిన తర్వాత ప్రజలు మా వద్దకు వస్తున్నారు. నేను గత 11 సంవత్సరాలలో 7 లక్షల మంది రోగులకు చికిత్స చేసాను. నా రోగులలో చాలా మంది చాలా సంతోషంగా ఉన్నారు. చాలా పనులు చేసుకుంటూ ఉన్నారు." అని తెలిపారు. డాక్టర్ సాదిక్ కేస్ స్టడీస్ మంచాన ఉన్న రోగులపై మూలకణాల ప్రభావాన్ని చూపుతాయి. పలువురు రోగులలో సానుకూల స్పందన రావడంతో పాటు నడవడానికి, సాధారణ జీవితాన్ని గడపడానికి దారి తీస్తుంది.

ఆటిజం, పార్కిన్సన్స్ డిజార్డర్:

పిల్లలలో ఆటిజం చాలా ఆలస్యంగా చికిత్స చేయబడుతుంది. ఎన్నో కుటుంబాలు పిల్లలకు వైద్య చికిత్స చేయించుకోడానికి ఇష్టపడవు. ఈ కారణంగా, ఈ పిల్లలు సాధారణ జీవితాలను గడపడానికి సహాయపడటానికి కౌన్సెలింగ్, పునరావాస చికిత్సల రూపంలో ముందస్తు ట్రీట్మెంట్ అందించడానికి డాక్టర్. సాదిక్ ఆటిజంపై దృష్టి పెట్టారు.

"హైదరాబాద్ నుండి చాలా మంది వ్యక్తులు ఆటిజం చికిత్స కోసం బెంగుళూరులోని మా కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ కారణంగా, మా హైదరాబాద్ కేంద్రం జనవరి 2020లో స్థాపించబడింది. మహమ్మారి కారణంగా ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు ట్రీట్మెంట్ కు కాస్త సమయం అవసరం అయింది" అని డాక్టర్ సాదిక్ అన్నారు.

స్టెమ్ సెల్ చికిత్స కారణంగా శరీర కణాలను పునరుద్ధరించడంలో సహాయపడతాయి. కాబట్టి వైద్యులు వృద్ధులలో పార్కిన్సన్స్‌పై దృష్టి సారిస్తున్నారు. "ప్రజలు అందుబాటులో ఉన్న చికిత్స, పునరావాస ప్రక్రియల సరైన రూపాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇవి వ్యాధిని ప్రారంభ దశలోనే అధిగమించడంలో సహాయపడతాయి. ఒకసారి గుర్తించిన తర్వాత, వారికి ఎంత వేగంగా చికిత్స చేయవచ్చో సులభం అవుతుంది. ఈ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి." అని సాదిక్ చెప్పుకొచ్చారు.

డాక్టర్ సాదిక్ కు వచ్చిన అవార్డులు:

''మంచాన పడిన రోగులు తిరిగి సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉండడమే నాకు వచ్చిన గొప్ప రివార్డులు, అవార్డులు అని అంటుంటారు సాదిక్. ఇవే నా విజయానికి అతిపెద్ద చిహ్నాలు. ఎంతో మంది చెప్పే మాటలు, తమ కేంద్రం వృద్ధిలోకి రావడం కీలకం'' అని చెప్పుకొచ్చారు సాదిక్.

ఆయన చికిత్స అందించిన పలు వివరాలు డాక్యుమెంట్ చేయబడ్డాయి. మెడికల్ జర్నల్స్‌లో ప్రచురించబడ్డాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఆయన పనిని గుర్తించారు. డాక్టర్ సాదిక్‌ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలువురికి చికిత్స అందించారు. "మా ప్రయత్నం వీలైనంత ఎక్కువ సంఖ్యలో ప్రజలకు మంచి చేయడం. ఇలాంటి వ్యాధులకు చికిత్స చేయలేమనే అపోహను తొలగించడం. ఎన్నో రోగాలను మనం బాగు చేయవచ్చు అనే హాప్ ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాను" అని ఆయన అన్నారు.

Next Story