పిల్లలకు వైద్యం చేయడంపై ఎన్నో కీలక సూచనలు ఇస్తున్న డాక్టర్ అల్తాఫ్ నసీమ్

Counseling is now a major requirement for pediatrics, says Hyd Dr. Altaf Naseem. పిల్లలకు ఎప్పుడు వైద్యం ఇవ్వాల్సి ఉంటుందో తెలుసుకోవడం చాలా కష్టమైన అంశమే..! పిల్లల వైద్య అవసరాలను అర్థం చేసుకోవడం

By అంజి  Published on  11 Aug 2022 8:50 PM IST
పిల్లలకు వైద్యం చేయడంపై ఎన్నో కీలక సూచనలు ఇస్తున్న డాక్టర్ అల్తాఫ్ నసీమ్

పిల్లలకు ఎప్పుడు వైద్యం ఇవ్వాల్సి ఉంటుందో తెలుసుకోవడం చాలా కష్టమైన అంశమే..! పిల్లల వైద్య అవసరాలను అర్థం చేసుకోవడం కూడా తేలికైన పని కాదు. వారు చూపించే సంకేతాలు, చేష్టలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇది పీడియాట్రిక్స్‌లో సవాలుతో కూడుకున్న అంశం. ఈ ఛాలెంజ్ ను డా. అల్తాఫ్ నసీమ్ స్వీకరించారు. శిశు సంరక్షణకు సంబంధించి నైపుణ్యం సాధించేలా ప్రేరేపించింది. 2003లో సేథ్ G S మెడికల్ కాలేజీ, KEM ముంబైలో తన స్పెషలైజేషన్ పూర్తి చేశారు.

ఆ సమయంలో పీడియాట్రిక్ మెడిసిన్ ద్వారా రోగాన్ని కనుక్కోవడం.. వాటికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ గురించి చర్చ జరుగుతూ ఉంది. గత 19 సంవత్సరాలలో, పీడియాట్రిక్ మెడిసిన్ లో భారీగా మార్పులు వచ్చాయి. ఒవైసీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో పీడియాట్రిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ నసీమ్ మాట్లాడుతూ "వైద్యం అనేది వ్యాధులకు చికిత్స చేయడమే కాకుండా.. నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించినది. పీడియాట్రీషన్ విషయంలో ఇప్పుడు చాలా కౌన్సెలింగ్ అవసరం. ప్రివెంటివ్ మెడిసిన్ అనేది సైన్స్ స్ట్రీమ్ లో ఒక భాగం.. వ్యాక్సినేషన్ కౌన్సెలింగ్ కూడా అందులోనిదే." అని అన్నారు.

ఈ మార్పుకు అనేక కారణాలు ఉన్నాయని డాక్టర్ నసీమ్ చెప్పుకొచ్చారు. "పిల్లలకు వ్యాక్సిన్‌లు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో వ్యాధులను నివారించడంలోనూ.. మరణాలను తగ్గించడంలోనూ సహాయపడతాయి. జీవనశైలిలో మార్పుల కారణంగా ఊబకాయం వంటి వ్యాధులు వచ్చాయి. జంక్ ఫుడ్ తీసుకోవడం వంటి ఆహారపు అలవాట్లపై కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు.. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ వంటి వాటిపై సరైన అవగాహన తీసుకుని రావల్సి ఉంది. భారతదేశంలో చిన్నపిల్లల్లో స్థూలకాయం భారతదేశంలో 10 నుండి 12 శాతం ఉంది. మరోవైపు సీజనల్ వ్యాధులు కూడా సవాలు విసురుతున్నాయి. వాటిని ప్రతి సంవత్సరం జూన్ నుండి సెప్టెంబర్ వరకు పరిష్కరించాల్సి ఉంటుంది. గత 8 సంవత్సరాలలో డెంగ్యూ బాగా ప్రబలింది," అని ఆయన అన్నారు.

డెంగ్యూకు చికిత్స కేవలం ఔషధం మాత్రమే కాదు.. కొత్త పరిశోధనలను, మార్గదర్శకాలను అనుసరించాలని నసీమ్ చెప్పారు. "చికిత్సలో భాగంగా కొత్తగా వస్తున్న ఔషధాలు, మారుతున్న ప్రోటోకాల్‌లను గుర్తుంచుకోవాలి. డెంగ్యూ కు ట్రీట్మెంట్.. పీడియాట్రీషియన్ లకు కూడా ఒత్తిడి కలిగించే అంశం, దీనికి నైపుణ్యంతో కూడిన పర్యవేక్షణ అవసరం," అని ఆయన చెప్పారు.

సీజనల్ వ్యాధులైనటువంటి డెంగ్యూ, చికెన్ గన్యా ప్రబలుతున్న సమయంలో వైద్యుల మీద ఎంతో ఒత్తిడి ఉంటుందని డాక్టర్ నసీమ్ తెలిపారు. "రోగాలు ప్రబలే నెలల్లో నేను రాత్రి పూట పడుకోడానికి మాత్రమే ఇంటికి వెళ్తాను. రోగులతో ఆసుపత్రి నిండి ఉంటుంది కాబట్టి.. ఎక్కువ సమయం ఆసుపత్రిలోనే ఉంటుంటాను. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిపై చాలా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది" అని నసీమ్ చెప్పుకొచ్చారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో.. తల్లిదండ్రులు, పిల్లలకు కౌన్సెలింగ్ ఇస్తూ ఉంటామని.. ఆ సమయంలో వారిపై చాలా ఒత్తిడి ఉండడాన్ని చూశామని అన్నారు. "కోవిడ్ 19 కు చికిత్స ఇస్తున్న సమయంలో పిల్లలు భయాందోళనలకు గురయ్యారు. కుటుంబంలోని వారు కూడా చాలా కాలం పాటు ఇబ్బంది పడ్డారు. ఆ సమయాల్లో పిల్లలను మోటివేట్ చేయడం కూడా చాలా అవసరం. పరిస్థితుల్లో మార్పులు రావడం.. పాఠశాలలు ఇప్పుడు మునుపటిలా పని చేస్తుండడంతో పిల్లల జీవితాలు సాధారణ స్థితికి వచ్చాయి" అని డాక్టర్ నసీమ్ చెప్పారు. తన వద్దకు వచ్చే రోగులతో ఎమోషనల్ గా బాండింగ్ ఉంటుందని డాక్టర్ నసీమ్ తెలిపారు. ఎంతో మంది పండగల సమయంలో తనకు శుభాకాంక్షలు చెబుతూ ఉంటారని చెప్పుకొచ్చారు.

వైద్య వృత్తిలో ఉన్న సమయంలో హాలిడేస్ చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఖాళీ సమయం దొరికితే క్రికెట్ ఆడుతూ ఉంటానని అన్నారు నసీమ్. డాక్టర్. S A జబీన్.. ఆయన భార్య న్యూరాలజిస్ట్ గా పని చేస్తూ ఉన్నారు. ఆమె నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో న్యూరాలజీ విభాగానికి అధిపతి. పిల్లలు పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి.. సెలవులను ప్లాన్ చేయడానికి పిల్లల క్యాలెండర్‌ను అనుసరించాలని చెప్పుకొచ్చారు. "నేను సెలవుల కోసం నా పిల్లల షెడ్యూల్‌ని అనుసరిస్తాను, ఆసుపత్రిలో విధుల కారణంగా వారితో గడిపే సమయం చాలా తక్కువ కాబట్టి వారికి నాణ్యమైన సమయాన్ని ఇవ్వాలంటే తప్పకుండా పిల్లలకు ఎప్పుడు హాలిడేస్ ఉంటాయా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది" అని డాక్టర్ నసీమ్ చెప్పారు.

Next Story