కరోనా సోకిన వృద్దులలో గుండెపోటు లక్షణం!
Corona Side Effects. కరోనా సోకిన వృద్దులలో గుండెపోటు లక్షణం,కరోనా వైరస్ వ్యాపించి దాదాపు సంవత్సరం కావస్తున్న ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం.
By Medi Samrat Published on 1 Jan 2021 9:16 AM ISTకరోనా వైరస్ వ్యాపించి దాదాపు సంవత్సరం కావస్తున్న ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం కరోనా గురించి బయట పెడుతున్నారు. తాజాగా కరోనా బారిన పడినవారిలో 80 సంవత్సరాల పైబడిన వృద్ధుల్లో తీవ్ర అస్వస్థతకు గురై గుండెపోటు రావడం సర్వసాధారణ మేనని తాజా పరిశోధనలలో వెల్లడైందని నిపుణులు తెలియజేశారు. కరోనా బారిన పడన వారికి సైతం వయసు పైబడటం తో గుండెపోటు రావడం అనేది సర్వసాధారణం. అలాంటిది కరోనా వైరస్ వచ్చిన తర్వాత గుండెపోటుకు గురవడం సాధారణ విషయమేనని అంటున్నారు నిపుణులు.
కరోనా సోకిన వృద్ధుల్లో ప్రమాదాలకు గల కారణాలు, వారి ఆరోగ్య పరిస్థితుల పై అమెరికా యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధనలు నిర్వహించారు. వీరి పరిశోధనలలో భాగంగానే కరోనా సోకిన ఆస్పత్రులలో చేరి తీవ్ర అస్వస్థతకు గురైన వయోవృద్ధులలో గుండెపోటు రావడం గుర్తించారు. అమెరికా వ్యాప్తంగా దాదాపు 68 ఆసుపత్రులలో సుమారు5,019 మందిని 80 ఏళ్ల పైబడిన వృద్ధులను పరిగణలోకి తీసుకున్నారు. వీరిలో దాదాపు 14 శాతం మంది ఆసుపత్రిలో చేరిన కొద్ది రోజుల్లోనే గుండెపోటు రావడంతో మరణించినట్లు తెలిపారు.
మిగతా కొందరు మాత్రం సిపిఆర్ అందించడం ద్వారా గుండెపోటు సమస్యల నుంచి ఎదుర్కొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతున్నారు.ఈ పరిశోధనల ద్వారా కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో దాదాపు గుండెపోటుకి గురవుతున్నారని స్పష్టం చేశారు. అంతేకాకుండా మరికొంతమందిలో సిపిఆర్ చికిత్స చేస్తున్నప్పటికీ కూడా వారు గుండెపోటుకు గురవుతుడడం గమనార్హం. అయితే 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులలో కరోనా బారిన పడకుండా వీలైనంత తగిన జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వయసు పైబడటంతో అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలియజేస్తున్నారు.