కోవాగ్జిన్‌పై భారత్‌ బయోటెక్‌ కీలక ప్రకటన

కోవిషీల్డ్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయన్న ప్రకటనతో మిగతా వ్యాక్సిన్లు తీసుకున్నవారిలోనూ ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే కోవాగ్జిన్‌పై భారత్‌ బయోటెక్‌ ప్రకటన చేసింది.

By అంజి  Published on  2 May 2024 8:45 PM IST
Bharat Biotech, Covaxin, AstraZeneca, Covid-19 vaccine

కోవాగ్జిన్‌పై భారత్‌ బయోటెక్‌ కీలక ప్రకటన

కోవిషీల్డ్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయన్న ప్రకటనతో మిగతా వ్యాక్సిన్లు తీసుకున్నవారిలోనూ ఆందోళన మొదలైంది. భారతదేశంలో కోవిషీల్డ్‌గా విక్రయించబడిన కోవిడ్-19 వ్యాక్సిన్ "అరుదైన" దుష్ప్రభావాలకు కారణమవుతోందని ఆస్ట్రాజెనెకా అంగీకరించడంపై చర్చ నడుస్తున్న వేళ.. కోవాగ్జిన్‌పై భారత్‌ బయోటెక్‌ ప్రకటన చేసింది. నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రజల భద్రతను దృష్‌టిలో పెట్టుకుని దీన్ని రూపొందించినట్టు తెలిపింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన తర్వాతే కోవాగ్జిన్‌ను విడుదల చేశామని తెలిపింది. తమ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాలేదని వెల్లడించింది.

భారత్ బయోటెక్ తన ఎక్స్ హ్యాండిల్‌పై విడుదల చేసిన ఒక ప్రకటనలో.. కోవాక్సిన్ మొదట ప్రజల భద్రతపై దృష్టి సారించి, తరువాత సమర్థతతో అభివృద్ధి చేయబడిందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని కోవిడ్-19 ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లోభాగంగా ట్రయల్స్‌ కూడా జరిగాయని, కొవిడ్ 19 వ్యాక్సిన్‌లలో ఈ రికార్డు కేవలం కొవాగ్జిన్‌కి మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఎక్స్‌ వేదికగా పెట్టిన పోస్ట్‌లో ఓ నోట్‌ని విడుదల చేసింది భారత్ బయోటెక్. Covaxin - Safety First పేరుతో కొన్ని కీలక అంశాలు అందులో ప్రస్తావించింది.

కొవిడ్ -19 కి సంబంధించిన ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఏకైక కరోన వ్యాక్సిన్ కొవాగ్జిన్ మాత్రమే. ఈ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ సమర్థమైందని తేలింది. లైసెన్స్‌ పొందే ముందు దాదాపు 27 వేల మందిపై ప్రయోగించి, ఫలితాలు పరిశీలించింది. ఆ తరవాతే కొవాగ్జిన్ టీకా ఆమోదం పొందింది. క్లినికల్ ట్రయల్స్‌ జరుగుతున్న సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. భద్రతలో ఏ మాత్రం రాజీ పడలేదు. కొవాగ్జిన్ టీకా సురక్షితమైందే అని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వినియోగించవచ్చని ఆమోద ముద్ర వేసింది. కొవాగ్జిన్ తయారీ మొత్తంలో సేఫ్‌టీ మానిటరింగ్ ఎక్కడా దారి తప్పలేదు. అంతా పకడ్బందీగా జరిగింది.

Next Story