పుచ్చకాయ తింటే శరీరంలో ఏమవుతుందో తెలుసా..?

Benifits Of Watermelon. పుచ్చకాయ.. ఇది అందరికి ఇష్టమే. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని కూడా

By Medi Samrat  Published on  7 March 2021 4:50 AM GMT
Benefits Of Watermelon

పుచ్చకాయ.. ఇది అందరికి ఇష్టమే. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని కూడా చాలా మందికి తెలిసిందే. ఇది మన శరీరంలో వేడిని తగ్గించి చల్లదనాన్ని పరుస్తుంది.. ఎండాకాలంలో పుచ్చపండు తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వేసవి తాపాన్ని, దాహార్తిని తీర్చేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రోహిణీకార్తె సమయంలో మన శరీరంలో వాటర్‌ లెవెల్స్‌ తగ్గిపోతూ ఉంటాయి. డీహైడ్రేషన్‌ నుంచి రక్షిస్తుంది. శరీరంలో వాటర్‌ స్థాయి తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వ్యాధి నిరోధక శక్తి పెంచే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌-బీ, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పోటాషియం, క్లోరిన్‌, జిటాకేరోటిన్లు, ఆల్కలైన్‌, విటమిన్‌-ఏ, విటమిన్‌ -బీ6, విటమిన్‌-సి తదితరాలు పుష్కలంగా లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు.

పుచ్చకాయ వల్ల కలిగే లాభాలు :

- పుచ్చకాయ రక్తపోటు, గుండెపోటును నివారిస్తుంది.

- మధుమేహం ఉన్నవారికి మంచి ఔషధంగా పని చేస్తుంది.

- గర్భిణీ మహిళలకు తింటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు

- కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు, తేనెలో కలిపి పుచ్చకాయ తింటే ఎంతో మంచిది.

- డీహైడ్రేషన్ సమస్యను నివారించవచ్చు.

- శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది.

- ఎండ వల్ల వచ్చే టాన్, దద్దుర్లను తగ్గిస్తుంధి.

- బీపీ ని కంట్రోల్ చేస్తుంది. రక్త సరఫరా మెరుగుపరుస్తుంది.

- క్యాన్సర్‌ వ్యాధిని తగ్గించే గుణం పుచ్చకాయలు ఉంది

- నాడీ వ్యవస్థ పని తీరుని మెరుగుపరుస్తుంది. దాని వల్ల

- మనసుకు శరీరానికి ప్రశాంతతను చేకూరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది .

- కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, మలబద్ధకంతో బాధపడేవారికి పుచ్చకాయ ఎంతో మంచిది.

- కాల్షియం అధికంగా ఉన్న పుచ్చకాయ తింటే కీళ్లనొప్పులు, వాతం లాంటి రోగాలు నయమవుతాయి.


Next Story