ఆకు కూరలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
Benefits of eating green leafy vegetables. పోషకాలు అధికంగా ఉండే సూపర్ ఫుడ్ గ్రూప్‌లో ఆకు కూరలు ఒకటి. ఈ ఆకు కూరలు మీ రోజువారీ ఆహారంలో
By అంజి Published on 18 Nov 2022 10:42 AM GMTపోషకాలు అధికంగా ఉండే సూపర్ ఫుడ్ గ్రూప్‌లో ఆకు కూరలు ఒకటి. ఈ ఆకు కూరలు మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో ఉత్తమం. ఆకు కూరలు తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బుల వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆకు కూరలు బరువు తగ్గడానికి, గుండె సంబంధిత సమస్యలను చక్కదిద్దడానికి ఎంతో సాయం చేస్తాయి. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. మీరు ఎక్కువ కాలం ఉత్సహంగా ఉండేలా చేస్తాయి. పాలకూర, బచ్చలికూర, బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ అత్యంత ప్రసిద్ధ ఆకుపచ్చ ఆకు కూరలు. ఈ ఆకు కూరల్లో ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇక్కడ ఆకు కూరలు తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1.అధిక పోషకాలు:
ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ మంచి కొవ్వు అనేక జీవ ప్రక్రియలకు కీలకమైనది. ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు అనేక వ్యాధులను తగ్గిస్తుంది. ఆకుపచ్చని ఆకుకూరల్లో ఇనుము, కాల్షియం, విటమిన్ సి కూడా ఉంటుంది.
2. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
ఆకు కూరల్లో ఉండే పోషక విలువలు.. మధుమేహం, ఉబ్బసం, అల్జీమర్స్ వ్యాధి వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ ఆకు కూరల్లో మొక్కల ఆధారిత మూలకాలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి వ్యాధికి కారణమయ్యే ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా మీ రోగనిరోధక వ్యవస్థలను బలోపేతం చేస్తాయి.
3. క్యాన్సర్ ప్రమాదం తక్కువ:
క్యాన్సర్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సహాయపడే గ్లూకోసినోలేట్స్ అని పిలవబడే పదార్థాలు కూడా వీటిలో పుష్కలంగా ఉన్నాయి. పచ్చని ఆకు కూరలు తినడం వల్ల రొమ్ము, ప్యాంక్రియాటిక్, మూత్రాశయం, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఆకుపచ్చ ఆకు కూరలల్లో కొన్ని ఎంజైమ్‌లు డీఎన్‌ఏ, కణాలకు నష్టం జరగకుండా నిరోధించడంలో సహాయపడతాయి. అయితే మరికొన్ని యాంటీఆక్సిడెంట్ సామర్థ్యాలను కలిగి ఉంటాయి.
4. బరువు తగ్గడంలో సాయం:
గ్రీన్ లీఫీ వెజిటేజీలు మీ రోజువారీ ఫైబర్ అవసరాలలో 20 శాతం వరకు అందించడంలో సహాయపడతాయి. రోజూ 30 గ్రాముల ఫైబర్ తీసుకోవడం వల్ల మధుమేహం, ఊబకాయం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలాగే బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది.
5. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
పండ్లు, కూరగాయలు అధికంగా తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అలాగే.. ఆకుకూరలు కూడా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండె సమస్యలు, స్ట్రోక్‌లకు కారణమయ్యే కొవ్వు పేరుకుపోకుండా ధమనులు మంచిగా పని చేస్తాయి. ఈ ఆకు కూరల వల్ల కలిగే అనేక ప్రయోజనాలు ఇప్పుడు మీకు తెలిశాయి. ఇక వాటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోని.. ఆరోగ్యంగా ఉండండి.