వేప చెట్టు : ఓ స‌ర్వరోగ నివారిణి!

Benefits Chewing Neem. మన భారత దేశంలో వేపకున్న విశిష్టత ప్రత్యేకమైనది.. వేప సర్వరోగ నివారిణి.

By Medi Samrat  Published on  3 Feb 2021 3:00 AM GMT
Neem health benefits

మన భారత దేశంలో వేపకున్న విశిష్టత ప్రత్యేకమైనది.. వేప సర్వరోగ నివారిణి. వేప చెట్టు ఆకులు, గింజలు, పూత, బెరడు పంటి భాగాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పంటి, కంటి, రక్తశుభ్రత, పంట చీడ పురుగులను నాశనం చేసేందుకు ఇలా ఎన్నో రకాలుగా వేప ఉపయోగపడుతుంది. వేలాది సంవత్సరాల క్రితం నుండి వేపు అనేక చర్మ వ్యాధులు, చిరకాలంగా తగ్గని పుళ్లు, మధుమేహం, రక్త దోషాలు, శరీర దుర్గంధం, ప్రేగుల్లో క్రిములు మొటిమలు మొదలైన రోగాలను నయం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

లేత వేప కొమ్మల తో పళ్లు తోమడం ఒక అలవాటుగా మార్చుకున్న వారికి నోటి దుర్వాసన, డయేరియా, చిగుళ్ల నుంచి రక్తం కారడం పూర్తిగా తగ్గుతుంది. మెంతులు, లేత వేప ఆకులు రుబ్బి, ఆ రసం వడకట్టి కటిక చేదు గానే ఉన్నప్పటికీ రోజుకు రెండు పూటలా ఓ స్పూన్ చొప్పున తీసుకుంటూంటే మధుమేహం తగ్గుతుంది. ప బెరడు చర్మవ్యాధులకు, జ్వరాలు, అంటువ్యాధులకు మంచి మందు. లేత వేప బెరడు, ఆకుల తో నూరి గాయాలు పై పూత గ వాడుకోవచ్చు.

వేప పువ్వులు నూరి కట్టు కట్టడంతో కుష్టు, బొల్లి, సోరియాసిస్ వంటి చర్మవ్యాధులు పోతాయి. కొన్ని వేప గింజల రసాన్ని తేనెతో కలిపి సేవిస్తే పచ్చ కామెర్ల వ్యాధి నయం అవుతుంది. చర్మంపై పొంగు వ్యాధి వల్ల ఏర్పడే మచ్చలను, వేప చిగుళ్లను నూరి మర్దనా చేసి మచ్చలు పోతాయి. పువ్వు పొడి, కొంచెం తేనె లేక బెల్లం తో కలిపి తీసుకుంటే బలహీనత తగ్గుతుంది. వేప చిగురు రోజూ తినడం అలవాటు గా మార్చుకున్న వారికి దగ్గు, అజీర్ణం, కడుపులో పురుగుల బెడద ఉండవు,వేపాకులు నమిలితే వాంతులు, వామిటింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతాయి.

అమ్మవారు తగ్గిన తర్వాత వేప ఆకులు – మిరియాలు కలిపి మెత్తగ నూరి శరీరానికి పూర్తిగా పూయడం, అలాగే ఉసిరికాయంత వేప ముద్ద రోజూ రెండుసార్లు నోట్లోకి తీసుకోవడం ఉత్తమం. ఇక వేపాకు రసం కాలేయం మీద పని చేసి సర్వ రోగాలను అరికడుతుంది. ( అమ్మవారు (చికెన్ పాక్స్) సోకిన వ్యక్తి పరుపు/పడకపై వేపాకులు పరవడం పూర్వం నుంచి ఉంది.




Next Story