మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటున్నారా?

మనలో చాలా మంది పని మీద బయటకు వెళ్లినప్పుడు, ఆఫీసు పనిలో బిజీగా ఉన్నప్పుడు మూత్రం వచ్చినా వెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తారు.

By అంజి  Published on  21 Nov 2024 8:30 AM IST
holding urine, bladder, health

మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటున్నారా?

మనలో చాలా మంది పని మీద బయటకు వెళ్లినప్పుడు, ఆఫీసు పనిలో బిజీగా ఉన్నప్పుడు మూత్రం వచ్చినా వెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తారు. బయటకు వెళ్లినప్పుడు టాయ్‌లెట్స్‌ అందుబాటులో లేక వెళ్లలేకపోతే.. ఆఫీసులో అవకాశం ఉన్నా కొన్నిసార్లు వెళ్లరు. ఇలా చేయడం తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మనుషుల బ్లాడర్‌ 400 ఎంఎల్‌ నుంచి 600 ఎంఎస్‌ మూత్రాన్ని నిల్వ ఉంచగలదు. ఆ పరిమితికి మించి మూత్రం చేరితే బ్లాడర్‌ మీద ఒత్తిడి క్రమంగా పెరుగుతుంది. ఇలా పదే పదే జరిగితే యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

మూత్రాన్ని ఇలా ఎక్కువసార్లు ఆపుకున్నప్పుడు మూత్రాశయంలోనే బ్యాక్టీరియా వృద్ధి చెంది ఇతర భాగాలకు పాకి ఇన్ఫెక్షన్‌ ఏర్పడుతుంది. యూరిన్‌ ఎక్కువ సేపు ఆపుకుంటే పెల్విక్‌ ఫ్లోర్‌ కండరాలు బలహీనమై మూత్రం ఆపుకోలేని స్థితికి దారి తీసి యూరిన్‌ లీక్‌ అవడానికి కారణమవుతుంది. దీనివల్ల కొందరికి దగ్గినా, తుమ్మినా దుస్తుల్లోనే మూత్రం పడొచ్చు. కొందరికి యూరిన సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల మూత్రంలోని కొన్ని పదార్థాలు జిగటగా మారి కిడ్నీల్లో రాళ్లుగా ఏర్పడతాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది.

Next Story