'కరోనా' గురించి షాకింగ్‌ నిజాలు బయటపెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..!

By సుభాష్  Published on  1 April 2020 3:50 PM GMT
కరోనా గురించి షాకింగ్‌ నిజాలు బయటపెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..!

కరోనా.. ఈ పేరు వింటేనే గజగజ వణికిపోవాల్సిందే. కంటికి కనబడని ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. కంటికి ఏ మాత్రం కనిపించకున్నా.. మృత్యువును వెంటాడుతుంది. ఒకరి నుంచి ఒకరికి పాకతూ మనుషులను చంపేలా చేస్తోంది. మొత్తం మీద కరోనా సైలెంట్‌ కిల్లర్ అనే చెప్పాలి‌. ఈ వైరస్‌ చేస్తున్న మాయలు అన్నీ ఇన్నీ కావు. కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అద్యయనం చేసింది. ఇందులో కొన్ని దిమ్మదిరిగే నిజాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ వైరస్‌ సోకిన వ్యక్తుల్లో కొందరు చలాకీగా, ఆరోగ్యంగానే ఉంటున్నారని వెల్లడైంది. అసలు వారికి ఈ వైరస్‌ సోకినట్లు కూడా తెలియనే తెలియదట. వారికి తెలియకుండానే ఇతరులకు సోకింపజేస్తారని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ వర్గాలు చెబుతున్నాయి.

వారి వల్లే ఈ వైరస్‌ అధికంగా వ్యాపిస్తోందని, వారిలో ఈ లక్షణాలు ఏ మాత్రం కనబడవని ఈ సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వైరస్‌ సోకితే తాము అనారోగ్యంగా ఉన్నామని అనిపించదు.. ప్రతి ఆరుగురిలో ఒకరికి మాత్రమే ఇదీ సీరియస్‌ అవుతుంది.. ఇది మా అధ్యయనంలో తెలిసిందని డబ్ల్యూహెచ్‌వో వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా ఓ విషయాన్ని ప్రస్తావించింది. దక్షిణ కోరియాలో 31 ఏళ్లు ఉన్న ఓ మహిళకు ఎన్నో రోజులపాటు ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదని, ఓ చిన్న రోడ్డు ప్రమాదం జరగడం వల్ల ఆమె వైద్యుని వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటే అప్పుడు కరోనా లక్షణాలు బయటపడ్డాయని వెల్లడించింది. అప్పటికే ఆమె ఎంతో మందిని కలుస్తూ, వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపింది. ఫలితంగా ఆ దేశంలో ఆమె మూలంగా 60 శాతం కరోనా కేసులకు కారణమైనట్లు గుర్తు చేసింది.

ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మసీదులో మతపరమైన కార్యక్రమాలకు హాజరైన వేలాది మందిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసింది ఆరోగ్య సంస్థ. వారిలో కొందరికి ఇదివరకే కరోనా పాజిటివ్‌ లక్షణాలున్నట్లు తెలిపింది. జమాత్‌ గ్రూపునకు చెందిన ఈ తబ్లీగీ జమాతే సభ్యుల్లో చాలా మంది విదేశాల నుంచి వచ్చిన వారున్నారని, వాళ్లకు తెలియకుండానే ఇతరలకు ఈ వైరస్‌ను అంటించినట్లు వెల్లడైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు చెబుతున్నాయి.

Next Story