ఆయ‌న నా తండ్రి కాదు..!

టీమిండియాతో ఆదివారం గ్రీన్‌ఫీల్డ్ గ్రౌండ్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో విండీస్ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో రెండు వికెట్లతో రాణించిన హేడెన్‌ వాల్ష్ గుర్తున్నాడు క‌దా..! అత‌ను ఓ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఒక‌ప్ప‌టి విండీస్ దిగ్గ‌జ బౌల‌ర్ కోర్ట్నీ వాల్ష్‌ ఉన్నాడు క‌దా.. ఆ దిగ్గ‌జ పుత్ర‌ర‌త్న‌మే ఈ హేడెన్‌ వాల్ష్ అని అంద‌రూ పొర‌బ‌డుతున్నారు. దీనిపై హేడెన్‌ వాల్ష్ వివ‌ర‌ణ ఇచ్చారు.

మీడియాతో మాట్లాడుతూ హేడెన్‌ వాల్ష్.. మరోసారి మీఅంద‌రికి చెబుతున్నా.. నా తండ్రి విండీస్ లెజండ‌రీ పేసర్‌.. కోర్ట్నీ వాల్ష్‌ కాదు. ఇద్దరి పేర్లలో ‘వాల్ష్‌’ ఉండడంతో చాలామంది హేడెన్ వాల్ష్.. కోర్ట్నీ వాల్ష్ త‌న‌యుడు అనుకుని పొరపడుతున్నారు. నేను కెనడాలో జరిగిన టీ20 లీగ్‌లో ఆడుతుండగా.. కూడా ఎవరో నన్ను కోర్ట్నీ వాల్ష్‌ అని పిలిచారు. కానీ, ఆయన నా తండ్రి కాదు. క్రికెట్‌లో నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోడానికి చాలా కష్టపడుతున్నా.. ఇకనుంచైనా నేనెవరో అంతా గుర్తిస్తారని అనుకుంటున్నాను అని వివ‌ర‌ణ ఇచ్చాడు.

ఇక‌ దిగ్గజ క్రికెట‌ర్‌ కోర్ట్నీ వాల్ష్‌.. 1984 నుంచి 2001 వరకు విండీస్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ద‌శాబ్ద కాలంపాటు అత్యుత్త‌మ పాస్ట్ బౌల‌ర్‌గా జ‌ట్టుకు విశిష్ట‌మైన సేవ‌లు అందించాడు. కోర్ట్నీ వాల్ష్‌.. 132 టెస్టుల్లో 519 వికెట్లు, 205 వ‌న్డేల్లో 227 వికెట్లు సాధించాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.