తన బిడ్డపై అత్యాచారం చేసిన వాడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. తెలంగాణలో దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తరహాలోనే వాడిని కూడా శిక్షించాలంటూ అతను కోరుతున్నాడు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తర్వాత దేశంలో ఇలా మృగాళ్ల బారిన పడిన వారి కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ మీడియా ద్వారా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ ఏడాది మే 31వ తేదీన హర్యానాలో ఏడేళ్ల చిన్నారిపై కామాంధుడు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, బ్లేడ్ తో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆ చిన్నారికి వైద్యులు అనేక శస్ర్త చికిత్సలు చేసి ప్రాణం పోశారు. కాని అప్పటి నుంచి ఇప్పటి వరకూ బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఉంది. అయితే తెలంగాణ తరహాలోనే తన బిడ్డకు కూడా న్యాయం చేయాలని అడుగుతున్నాడు. వివిధ దేశాల్లో అత్యాచారం చేసిన వారికి రకరకాల శిక్షలు అమలులో ఉన్నాయని, మన దేశంలో కూడా అత్యాచార నిందితులను అత్యంత కఠినంగా శిక్షించే చట్టాలు అమలులోకి తీసుకురావాలని కోరాడు. తన బిడ్డకు పట్టిన గతి మరే ఆడకూతురికి పట్టకూడదని, ఆడపిల్లను చూస్తేనే భయపడేలా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.