పోర్న్ చూసే రేప్ చేశాడట..!!

తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలం గుట్టెన దీవి వేమవరం గ్రామంలో అరవై ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి చంపిన ఘటనలో అశ్చర్యమొందించే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. డిసెంబర్ 4 న ఈ అత్యాచారం జరిగింది. మహిళ మృత దేహం తన ఇంట్లోనే పడి ఉండగా ఇరుగూ పొరుగూ వారు చూసి పోలీసులకు తెలియచేశారు. ఈ కేసులో కేసనకుర్తి నాగబాబు అనే 31 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు.

నాగబాబు ఆ మహిళ ఇంట్లోకి దూరి, ఆమెపై లైంగిక అత్యాచారం చేసి, ఆ తరువాత ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఆ తరువాత ఇంట్లో ఉన్న రూ. 80,000 వేలను తీసుకుని పారిపోయాడు. పోలీసు జాగిలాలు తనను గుర్తించకుండా ఉండేందుకు అతను ఇల్లంతా కారం పొడి చల్లాడు. ఇలా చేస్తే కుక్కలు వాసన పీల్చవు.

అయినప్పటికీ జాగిలాలు అతడిని గుర్తించాయి. దీంతో ఇరుగూ పొరుగూ అతనికి దేహ శుద్ధి చేశారు. అయితే అతని మొబైల్ ను పరిశీలిస్తే దాని నిండా పోర్న్ వీడియోలే పోలీసులకు కనిపించాయి. అతడిని ప్రశ్నిస్తే తాను పోర్న్ వీడియోలు చూసే మహిళపై అత్యాచారం చేశానని అంగీకరించాడు. రేప్ కి ముందు పోర్న్ చూసినట్టు కూడా ఒప్పుకున్నాడు. లైంగికంగా నాగబాబు ఒక సైకోలా వ్యవహరించేవాడు. అందుకే అతని భార్య అతడిని వదలి వెళ్లిపోయింది. సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో అతనిపై ఒక దొంగతనం కేసు కూడా నమోదై ఉంది.

ఈ నేపథ్యంలో పలు మహిళా సంఘాలు పోర్ట్ సైట్లపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సైట్ల వల్ల యువకుల బుర్రలు చెడిపోతున్నాయని, కాబట్టి వాటిని తక్షణమే నిషేధించాలని వారు డిమాండ్ చేశారు.

పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, ఇతర శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. మహిళ రక్తం, ఇతర భాగాల సాంపిల్ లలను సేకరించి, ఫొరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.